కేసీఆర్ ఉలిక్కిపడే మాటను చెప్పిన కోదండరాం
రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చు. అందునా ఎన్నికల ముందు.. ఆ తర్వాత పలు సంచలన పరిణామాలు చోటు చేసుకోవటం మామూలే. మరో నాలుగైదు నెలల్లో తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించి.. గులాబీ బాస్ కేసీఆర్ కు ప్రధాన సేనానిగా వ్యవహరించిన కోదండరాం.. ఆ తర్వాత రాజకీయ పార్టీ పెట్టటం.. అదెలాంటి ప్రభావాన్ని చూపకపోవటం తెలిసిందే.
తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన రెండు ఎన్నికల్లోనూ గులాబీ బాస్ విజయాన్ని సాధించటం.. ముచ్చటగా మూడోసారి కూడా తన గెలుపు ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కు.. కరెంటు షాక్ తగిలే చందంగా కోదండం మాష్టారి తాజా ప్రకటన ఉందని చెప్పాలి. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కాస్త ముందుగా ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని పెట్టటం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ.. కాంగ్రెస్.. వామపక్షాలతో పొత్తుపెట్టుకన్న ఆయన.. ఆ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావాన్ని చూపకపోవటం తెలిసిందే.
రెండోసారి కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కోదండరాం తన ప్రాధాన్యతను పూర్తిగా కోల్పోయారు. ఈ రోజుకు తెలంగాణ ఉద్యమంలో నిజాయితీగా పోరాడిన ఉద్యమకారుల జాబితాలో కోదండరాం ముందుంటారు. అలాంటి ఆయన తాజాగా సూర్యాపేటలో నిర్వహించిన పార్టీ ప్లీనరీ సమావేశాల్లో మాట్లాడుతూ.. 'ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చేందుకు ఎలాంటి రాజకీయ నిర్ణయాన్ని తీసుకోవటానికైనా సిద్ధంగా ఉన్నాను. అవసరమైతే పార్టీని విలీనం చేయటానికి కూడా సిద్ధం'' అని పేర్కొన్నారు.
దీంతో. . కోదండరాం వ్యాఖ్యలు సంచలనంగా మారటంతో పాటు.. ఆయన ఏ పార్టీలో కి తన పార్టీని విలీనం చేయాలని భావిస్తున్నారు? అన్నది ప్రశ్నగా మారింది. బీఆర్ఎస్ ను ఓడించటమే ప్రధాన ఎజెండా ఉన్న కోదంరాంకు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో మాత్రమే తన పార్టీని విలీనం చేసే వీలుంది. అదే నిజమైతే.. కాంగ్రెస్ కు కొత్త ఉత్సాహం వచ్చినట్లే. మరి.. కోదండం తన పార్టీ విలీనంపై ఇంకేం చెబుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.