ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కోదండరాం...!!

Update: 2020-09-19 09:50 GMT
తెలంగాణలో త్వరలో పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో  తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన , కీలక నేత ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీ ఎన్నికల బరిలోకి దిగారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన ప్రొ.కోదండ రామ్ ‌కు నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ అభ్యర్థిగా మద్దతునివ్వాలని తెలంగాణ జన సమితి ప్రతిపక్ష పార్టీలను కోరింది. ఈ మేరకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమోక్రసీ పార్టీలకు టీజేఎస్‌ లేఖలు పంపింది.

కోదండరామ్‌ గెలుపు ప్రస్తుత అవసరమని నిరుద్యోగులు, యువత ఆశిస్తున్నారని, ప్రస్తుత పరిస్థితులపై మండలిలో గొంతెత్తే నాయకుడిని గెలిపించాలని టీజేఎస్‌ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ బాధ్యులు జి.వెంకట్‌రెడ్డి, ధర్మార్జున్, బైరి రమేశ్, శ్రీశైల్‌ రెడ్డి కోరారు. ఈ మేరకు కోదండరాంకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం, న్యూడెమొక్రసీ పార్టీలకు టీజేఎస్ లేఖలు రాసింది పట్టభద్రుల ఎమ్మెల్సీ  ఎన్నికల బరిలో కోదండరాం పోటీ చేయనున్నట్టు ఇది వరకే వార్తలు వచ్చాయి. ఇక ఇదే నేపథ్యంలో రెండు స్థానాలకు జరిగే ఈ ఎన్నికలను ప్రతిపక్షాలతో పాటు అధికార టీఆర్‌ఎస్‌ సైతం ఎంతో ప్రతిష్టాత్మకం‍గా భావిస్తోంది.
Tags:    

Similar News