• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భవిష్యత్ కెప్టెన్ గా...

భవిష్యత్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ : గవాస్కర్

By - Tupaki Desk
Update: 2021-09-17 06:30 GMT
భవిష్యత్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ ను ప్రోత్సహించాలని దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. కేఎల్ రాహుల్ నాయకత్వ లక్షణాలున్నాయన్నాడు. ఓ కొత్త కెప్టెన్ ను తయారు చేయాలనుకుంటే రాహుల్ పై దృష్టి పెడితే మంచిదని చెప్పాడు. కేఎల్ రాహుల్ 50 ఓవర్ల క్రికెట్ లో మెరుగైన ప్రదర్శన చేస్తున్నాడని అతణ్ని వైస్ కెప్టెన్ గానూ నియమించవచ్చని సన్నీ తెలిపాడు. కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.

టీ20 ప్రపంచ కప్ తర్వాత తాను టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని టీమిండియా సారధి విరాట్ కోహ్లీ ప్రకటించాడు. పనిభారాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కోహ్లీ తెలిపాడు. ఈ క్రమంలో పొట్టి ఫార్మాట్‌లో ఈ రికార్డుల వీరుడు ఏం సాధించాడో ఒకసారి పరిశీలిస్తే అద్భుతమైన రికార్డు కనిపిస్తుంది.

టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ నుంచి 2017లో టీ20 సారధ్య బాధ్యతలను కోహ్లీ తీసుకున్నాడు. అప్పటి నుంచి సత్తా చాటుతూనే వచ్చాడు. ఐపీఎల్లో కూడా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. టీమిండియా టీ20 సారధిగా 48.45 సగటుతో 1502 పరుగులు సాధించాడు. వీటిలో 12 అర్ధశతకాలు కూడా ఉన్నాయి.

మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్సీ బాధ్యతలు మోస్తుండడం వల్ల అధికభారం పడుతోందని తెలిపాడు. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరిగే టీ20 వరల్డ్ కప్ భారత టీ20 జట్టు కెప్టెన్ గా తనకు చివరి ఈవెంట్ అని వెల్లడించాడు. అయితే ఓ బ్యాట్స్ మన్ గా టీ20 జట్టులో కొనసాగుతానని కోహ్లీ స్పష్టత నిచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. భారత జట్టుకు ఆటగాడిగానూ, కెప్టెన్ గానూ ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశాలు లభించడాన్ని అదృష్టంగా భావిస్తాను. నా ఈ కెప్టెన్సీ ప్రస్థానంలో ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలెక్షన్ కమిటీ సభ్యులు, నా కోచ్ లు, మేం గెలవాలని ప్రార్థించే ప్రతి ఒక్క భారతీయుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి... వీళ్లు లేకుండా నేను లేను.

అయితే కెరీర్ లో పనిభారం గురించి కూడా అర్థం చేసుకోవాలి. గత 8-9 ఏళ్లుగా 3 ఫార్మాట్లలో తీవ్ర ఒత్తిడి భరిస్తున్నాను. ఐదారేళ్లుగా కెప్టెన్ గానూ అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో టెస్టులు, వన్డేల్లో శక్తిమేర ప్రదర్శన చూపాలంటే నాకు నేను కొంత వెసులుబాటు కల్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. టీ20 కెప్టెన్ గా ఇప్పటివరకు జట్టుకోసం సర్వశక్తులు ధారపోశాను. ఇకపైనా ఓ ఆటగాడిగా టీ20 జట్టులో కొనసాగుతాను. టీ20 కెప్టెన్సీ వదులుకోవాలన్న నిర్ణయం వెనుక నా సన్నిహితులతోనూ, కోచ్ రవిభాయ్ తోనూ, సహచరుడు రోహిత్ శర్మతోనూ ఎంతో చర్చించాను, ఎంతో ఆలోచించాను. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకున్న పిమ్మట అక్టోబరులో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీమిండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతలు వదులుకోవాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా, సెలక్టర్లకు వివరించాను అని వెల్లడించాడు.

టీమిండియా సారధిగా..
మ్యాచులు: 45
గెలిచినవి: 27
ఓటములు: 14
టై: 2
ఫలితం తేలనివి: 2
పరుగులు: 1502
అర్ధశతకాలు: 12
సగటు: 48.45
స్ట్రయిక్ రేట్: 143.18

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా..
మ్యాచులు: 132
గెలిచినవి: 60
ఓటములు: 65
ఫలితం తేలనివి: 4


Tags:    
  • KL Rahul 
  • latest news 
  • Trend 
  • Latest Updates 
  • Trending news 

Similar News

టికెట్ ధ‌ర‌ల‌పై CM విజ‌య్ ముందు చూపు మనవాళ్ల‌కు ఏదీ?

2026-11-04 09:39 GMT

ఏపీలో మ‌రో ఎన్నిక‌ల పోరు..!

2026-11-04 09:22 GMT

రాప్తాడు నిందితుడిపై కాల్పుల కేసులో కీలక పరిణామం

2026-11-04 09:14 GMT

ఎలా గెలవాలో చెప్పారు...జగన్ కంగ్రాట్స్ !

2026-11-04 09:06 GMT

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

పాపం ఏబీవీ : సోషల్ మీడియా హైప్....డిపాజిట్ గల్లంతు

2026-11-04 08:06 GMT

సుప్రీంషాక్‌: దిగొచ్చిన ఎన్నిక‌ల సంఘం.. బిగ్ రిలీఫ్‌!

2026-11-04 08:02 GMT

ఈమె ఏ పార్టీలోచేరినా విజయమే.. లక్ అంటే రమాకుమారిదే..

2026-11-04 08:01 GMT

కొత్త ఏటీఎం స్కాం.. విత్ డ్రా చేసినా డబ్బులు రావు.. జర జాగ్రత్త

2026-11-04 06:09 GMT

2029 ఎన్నికల్లో యువతదే కీలక పాత్ర.. రాజకీయ పార్టీలకు Gen Z కొత్త సవాల్!

2026-11-04 05:40 GMT

ఫుట్‌బాల్ మైదానంలో విషాదం.. గోల్‌కీపర్‌తో ఢీకొని ఆటగాడు మృతి!

2026-11-04 05:07 GMT

ఆదోనిలో జనసేన రెబల్ సంచలనం.. టీడీపీ, వైసీపీ అభ్యర్థులకు షాక్!

2026-11-04 04:56 GMT

Copyright @2026

Powered by Blink CMS