హరీశ్ రావు మర్చిపోయిన లాజిక్ ఏంటో చెప్పిన కిషన్ రెడ్డి
తెలంగాణలో ఇప్పుడు అధికార టీఆర్ఎస్ , ప్రతిపక్ష బీజేపీ మధ్య హాట్ హాట్ విమర్శల పర్వం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా కరోనా కల్లోలం గురించి జరుగుతున్న కామెంట్లు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. కరోనా వ్యాక్సిన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు టార్గెట్ చేస్తే, ఆయనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ల కొరతపై మంత్రి హరీశ్ రావు స్పందిస్తూ కేంద్ర వైపల్యం వల్లే సమస్య ఎదురవుతోందన్నారు. హైదరాబాద్‌లో వ్యాక్సిన్ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కేంద్రం అందించడం లేదని ఆక్షేపించారు. ఈ కామెంట్లపై కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ సభ్యులు కొందరు వ్యాక్సిన్ పై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు. హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఒక్కటే దేశంలోని వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తోందని, ఆ వ్యాక్సిన్ రాష్ట్రంలోనే వాడాలని అనడం సరికాదన్నారు. ఇతర ప్రదేశాల్లో ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్ తెలంగాణకు రావడం లేదా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఇప్పటి వరకు తెలంగాణ కొనుగోలు చేసింది నాలుగున్నర లక్షల డోసులేనని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 75 లక్షల డోసులు కేంద్రమే ఉచితంగా ఇచ్చింది అని తెలిపారు. హైదరాబాద్ లో కూర్చొని గ్లోబల్ టెండర్లు వేస్తే ఎవరూ ముందుకు రారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ కొరత ఉందని పేర్కొంటూ విదేశాంగ మంత్రి వ్యాక్సిన్ ముడి సరుకు కోసం ప్రపంచ దేశాల్లో పర్యటిస్తున్నారని తెలిపారు. డిసెంబరు నాటికి రాష్ట్రాలు కొనుగోలు చేసినా చేయక పోయినా కేంద్రం కొనుగోలు చేసి వ్యాక్సిన్ అందరకీ వేస్తుందని హామీ ఇచ్చారు.