కిషన్ రెడ్డి తలకు ఆ గాయం ఏమిటి? ఎందుకలా జరిగింది?

Update: 2021-08-20 06:41 GMT
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఏపీకి రావటం తెలిసిందే. విజయవాడకు వచ్చిన ఆయన.. తన సతీమణితో కలిసి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని సీఎం నివాసంలో కలవటం తెలిసిందే. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి దంపతులకు సీఎం జగన్ దంపతులు సాదర స్వాగతం పలికారు. ఇదంతా ఓకే అయినా.. విజయవాడకు వచ్చిన వేళలో కిషన్ రెడ్డి నుదిటిన లేని గాయం.. తిరిగి వెళ్లే సమయంలో ఉండటం గమనార్హం.

ఇంతకు ఆయన నుదిటికి గాయం ఎలా తగిలింది? అసలేమైంది? అన్నది ప్రశ్నగా మారింది. దీంతో.. పలువురు ఆరా తీశారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యక్తిగత సహాయకులు.. సిబ్బంది అందిస్తున్న సమాచారం ప్రకారం.. అనుకోని రీతిలో జరిగిన పరిణామంతోనే ఆయనకు గాయమైనట్లు తెలిసింది. ఇంతకూ అసలేం జరిగిందంటే..

విజయవాడలో నిర్వహించిన ఆశీర్వాద సభలో పాల్గొని తిరిగి వెళుతున్న కిషన్ రెడ్డికి.. అనూహ్యంగా కారు డోర్ బలంగా తగిలి.. నుదిటికి గాయమైంది. దీంతో ప్రథమ చికిత్స అనంతరం ట్యాబ్లెట్లు వేసుకొని పర్యటన కొనసాగినట్లుగా చెబుతున్నారు. ఇదే కిషన్ రెడ్డి నుదిటికి గాయానికి కారణమని చెబుతున్నారు. కేంద్రమంత్రి హోదాలో వచ్చిన కిషన్ రెడ్డిని సీఎం జగన్ సాదరంగా ఆహ్వానించటంతో పాటు.. శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమ.. నూతన వస్త్రాల్ని బహుకరించారు. విజయవాడకు రావటానికి ముందు కేంద్రమంత్రి హోదాలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తీర్థప్రసాదాల్ని అందజేశారు.




Tags:    

Similar News