ఏఐసీసీ ప్రెసిడెంట్ గా కిరణ్ కుమార్ రెడ్డి?

Update: 2019-07-27 05:10 GMT
ఒకసారి జాక్ పాట్ గా ముఖ్యమంత్రి అయిన కిరణ్ కుమార్ రెడ్డికి ఇప్పుడు  మరో పేరున్న పదవి దక్కబోతోందా? ఎవరూ నడిపించడానికి ముందుకు రాని పదవిని కిరణ్ కు కేటాయించనున్నారా? రాహుల్ వద్దని తేల్చేశాడు, ప్రియాంక కూడా ఆ పదవిని తీసుకోవడానికి రెడీగా లేదు. ఈ నేపథ్యంలో మరొకరికి ఎవరికైనా ఆ పదవిని ఇవ్వాలని కాంగ్రెస్ లో ప్రయత్నం జరుగుతోంది.

అందులో భాగంగా ఏఐసీసీ అధ్యక్ష పదవిని కిరణ్ కుమార్ రెడ్డికి ఆఫర్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది! ఆ పదవిని దక్షిణాది కాంగ్రెస్ నేతలకు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలో ఒక అభిప్రాయం ఉందట. రాహుల్ కూడా అలాగే భావిస్తున్నారట. అందులో భాగంగా సౌత్ నేతలను ఆ పదవి విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి కూడా అందులో ఒక ఛాయిస్ గా ఉన్నారని టాక్ వినిపిస్తోంది!

మాజీ  ముఖ్యమంత్రి అనే ట్యాగ్ కిరణ్ కుమార్ రెడ్డికి ఈ విషయంలో ఉపయోగపడుతూ ఉంది. అలాగే ఏఐసీసీ అధ్యక్ష పీఠంలో ఉన్న  వ్యక్తికి సొంతంగా ప్రజాబలం ఉండకూడదు. అది సోనియా - రాహుల్ లకు ఇష్టం ఉండే అంశం కాదు. తాము చెప్పినట్టు వినే వ్యక్తి కావాలి! అలాంటి వ్యక్తి అన్వేషణలో భాగంగా కిరణ్ కుమార్ రెడ్డి పేరు వినిపిస్తోందని సమాచారం.

కిరణ్ అయితే కాస్త ఇంగ్లిష్ లో కూడా మేనేజ్ చేయగలడు కాబట్టి.. సౌత్ నేతల్లో ఆయనే కాంగ్రెస్ హై కమాండ్ ఛాయిస్ అనే ప్రచారం జరుగుతూ ఉంది. మరి ఇప్పుడు కిరణ్ కు ఆ పెద్ద పదవి దక్కబోతోందా!
Tags:    

Similar News