బీసీసీఐలో బంధుప్రీతి..! పేరుకే గంగూలీ.. పెత్తనమంతా వాళ్లదే..!
బీసీసీఐపై క్రికెట్ పాలక కమిటీ (సీఓఏ) మాజీ సభ్యుడు, ప్రముఖ రచయిత, చరిత్రకారుడు రామచంద్ర గుహ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీసీసీఐలో రాజకీయ జోక్యం పెరిగి పోయిందని ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షా, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ .. బీసీసీఐ వ్యవహారాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. రామచంద్ర గుహ ‘ద కామన్వెల్త్ ఆఫ్ క్రికెట్’ ఇటీవల ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో పలు సంచలన విషయాలను ఆయన బయటపెట్టారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలన్నీ రాజకీయాలకు నిలయంగా మారాయని ఆయన ఆరోపించారు. అసలు సిసలైన క్రీడాకారులకు అవకాశం కల్పించకుండా.. రాజకీయ నాయకుల పిల్లలకు మాత్రమే అవకాశాలు కల్పిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర క్రికెట్ సంఘాలను రాష్ట్ర స్థాయి నేతల పిల్లలు నడిపిస్తున్నారని మండి పడ్డారు.
లోదా సంస్కరణలను ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. ఫాంటసీ గేమ్‌లు ఆడాలంటూ ఏకంగా బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీయే సూచించడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీసీసీఐలో ఈ స్థాయిలో రాజకీయాలు ఉన్నాక మంచి క్రికెటర్లు ఎక్కడి నుంచి వస్తారంటూ ప్రశ్నించారు. క్రికెటర్లు కూడా డబ్బుల కోసం తాపత్రయపడుతున్నారన్నారు. సంజయ్ మంజ్రేకర్‌ను వ్యాఖ్యాతల ప్యానెల్‌నుంచి తొలగించడాన్ని కూడా ఆయన తప్పుపట్టారు. వ్యాఖ్యాతల నోటికి తాళం వేయాలనుకోవడం ఓ తప్పుడు నిర్ణయం. ఏ దేశం కూడా ఇలా చేయదని పేర్కొన్నారు. తాజాగా ఆస్ట్రేలియా టూర్ కు కామెంటేటర్ గా సోనీ నెట్ వర్క్ మంజ్రేకర్ కు అవకాశమిచ్చింది.
రాజకీయ నాయకులు మనదేశ క్రికెట్ ను భ్రష్టుపట్టించారన్నారు. మన పల్లెల్లో ఎందరో గొప్పగొప్ప క్రికెటర్లు ఉన్నారని వారికి అవకాశం కల్పించి.. శిక్షణ ఇస్తే గొప్పగా ఎదుగుతారని అభిప్రాయ పడ్డారు. కానీ బీసీసీఐ మాత్రం స్వార్థంతో వ్యాపార దృక్ఫథంలో వ్యవహరిస్తున్నది. కొందరి కంబంధ హస్తాల్లో బీసీసీఐ చిక్కుకు పోయిందన్నారు. మొత్తానికి గుహ పుస్తకం లో వెల్లడించిన అభిప్రాయలు సంచలనంగా మారాయి.