ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పరిశ్రమ .. 1,750 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధం !

Update: 2020-10-28 07:50 GMT
ఆంధ్రప్రదేశ్ లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఆంధప్రదేశ్‍ లో ఎలక్ట్రిక్‍ వాహనాల తయారీ, రీఛార్జ్ యూనిట్లు ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఎలక్ట్రిక్‍ వాహనాల తయారీ, రీఛార్జ్ యూనిట్ల ఏర్పాటుకు కైనెటిక్‍ గ్రీన్‍ వ్యవస్థాపకురాలు, సీఈవో సులజ్జ ఫిరోడియా మోత్వాని ముందుకొచ్చారు. పర్యావరణానికి హాని లేని విద్యుత్‍ వాహనాలకు పెద్ద పిట వేస్తూ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోయే ప్లాంట్ లో విద్యుత్‍ వాహనాలను తయారుచేయాలని భావిస్తున్నారు. ఏఆర్‍ఏఐ (ఆటోమోటివ్‍ రీసెర్చ్ అసోసియేషన్‍ ఆఫ్‍ ఇండియా) ఆప్రూవ్‍ చేసిన మూడు చక్రాల విద్యుత్‍ వాహనాలను ప్రవేశ పెట్టిన మొదటి సంస్థగా కెనెటిక్‍ గ్రీన్‍ ఎనర్జీకి  మంచి పేరుంది.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఏపీలో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్డులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ లను ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో 1,750 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్ సులజ్జా ఫిరోదియా మోత్వానీ తెలిపారు. దీంతో పాటు ఈ రిక్షాల బ్యాటరీల స్వాపింగ్ కు అవసరమైన మౌలిక సదుపాయాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆమె తెలిపారు. అలాగే,  ఏపీ వ్యాప్తంగా ఎలక్ట్రిక్‍ వాహనాల రీఛార్జ్ స్టేషన్లు నెలకొల్పడంపైనా సంస్థ ప్రతినిధులు ఆసక్తి  కనబరుస్తున్నారు. ఇక ఈ ప్లాంట్ ను నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేయడానికి కైనెటిక్ ఆసక్తి చూపిస్తుండగా ..కనీసం 150 ఎకరాల భూమి అవసరం కానుంది. దీనితో నెల్లూరుతో పాటుగా చిత్తూరు , విశాఖ జిల్లాల్లోని భూములని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. పారిశ్రామిక రాయితీలపై ఓ స్పష్టత రాగానే దీనిపై సంస్థ తుది నిర్ణయం ప్రకటించబోతుంది.
Tags:    

Similar News