బోధన్ పాస్ పోర్టు కేసులో కీలక విషయాలు వెలుగులోకి..

Update: 2021-02-23 16:50 GMT
బోధన్ పాస్ పోర్ట్ కేసులో పోలీసులు విచారణ వేగవంతంగా కొనసాగుతోందని సైబరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. పాస్ పోర్ట్ వ్యవహారంపై సీపీ తాజాగా మీడియాతో సంచలన విషయాలు వెల్లడించారు.బోధన్ పాస్ పోర్టు మోసాల కేసులో మొత్తం 8మందిని అరెస్ట్ చేశామని సీపీ వెల్లడించారు. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని.. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని సజ్జనార్ తెలిపారు.

ప్రధాన నిందితుడిని బంగ్లాదేశ్ కు చెందిన పరిమళ్ బైన్ గా గుర్తించినట్లు తెలిపారు. ఓకే అడ్రస్ పై 32 పాస్ పోర్టులు జారీ అయినట్లు గుర్తించినట్టు సీపీ తెలిపారు. అలాగే పాస్ పోర్టుతోపాటు ఆధార్ కార్డులు కూడా తీసుకున్నారని వెల్లడించారు.అక్రమ పాస్ పోర్టులు, వీసాలతో 19మంది విదేశాలకు వెళ్లారని సీపీ తెలిపారు. ఈ పాస్ పోర్టు మోసాల కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నామని.. పరారీలో ఉన్న మిగతా వారిని కూడా పట్టుకుంటామని సీపీ తెలిపారు.

నిజామాబాద్ జిల్లాలో నకిలీ పాస్ పోర్టుల వ్యవహారం కలకలం రేపిన సంగతి తెలిసిందే. బోధన్ పట్టణానికి చెందిన కొందరు మీ సేవా నిర్వాహకులు డబ్బుల కోసం కక్కుర్తి పడి నకిలీ పత్రాలు సృష్టించి బంగ్లాదేశీయులకు నకిలీ ఆధార్ కార్డులు తయారు చేసి పాస్ పోర్టులు ఇప్పించారని విచారణలో తేలింది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగ్లాదేశీయులు నకిలీ పాస్ పోర్టులతో పట్టుబడడంతో ఈ ఢొంక కదిలింది..
Tags:    

Similar News