కేరళ విమాన ప్రమాదంం ఈ పాప తల్లిదండ్రులు ఎక్కడ?

Update: 2020-08-08 03:45 GMT
కేరళలోని కోజికూడ్ లో నిన్న రాత్రి దుబాయ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం రన్ వే నుంచి పక్కకు పోయి లోయలోపడి రెండు ముక్కలైంది. ఈ ఘోర విమాన ప్రమాదంలో 17మంది మరణించగా చాలా మంది గాయపడి చికిత్స పొందుతున్నారు. మొత్తం 184మంది  ప్రయాణికులతో ఈ విమానం పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

విమాన ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన ఓ చిన్నారి తన తల్లిదండ్రుల కోసం ఎదురుచూస్తోంది. సహాయక చర్యల్లో భాగంగా ఓ పోలీస్ ఆమెను ఎత్తుకున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అమాయకంగా చూస్తున్న ఆ చిన్నారి తల్లిదండ్రులు ఎక్కడున్నారు? బతికున్నారా? ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారా అన్నది  తెలియాల్సి ఉంది.

దీనంగా చూస్తున్న ఆ చిన్నారి ఫొటోను ఓ పోలీస్ షేర్ చేసి ఈ పాప కొండుట్టి ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని.. తల్లిదండ్రులు ఎవరో తెలియడం లేదని.. తెలిసిన వారుంటే 988769169కు ఫోన్ చేయాలని కోరారు. చిన్నారుల తాతలు, బామ్మలు ఉంటే సంప్రదించాలని సూచించారు. ప్రస్తుతం చిన్నారి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Tags:    

Similar News