• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కేసీఆర్ లో కరోనా మార్పు...

కేసీఆర్ లో కరోనా మార్పు మరీ ఇంత ఎక్కువగానా?

By - Tupaki Desk
Update: 2020-03-30 05:15 GMT
కరోనా ఎంతోమందిని మార్చేసింది. దేశాల రూపురేఖల్ని మార్చటేమ కాదు.. రానున్న రోజుల్లో మరిన్ని మార్పులకు కారణం కానుంది. అలంటి వాటితో పోల్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో వచ్చిన మార్పును పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కనిపించదు. కానీ.. ఎలాంటి పరిస్థితిలో అయినా తన అలవాట్లను మార్చుకునే విషయంలో ససేమిరా అన్నట్లు మొండిగా వ్యవహరించే కేసీఆర్.. కరోనా విషయంలో తగ్గటమేకాదు.. తనను తాను పూర్తిగా మార్చుకున్నారు.

తగ్గినంత మాత్రాన కేసీఆర్ కు పోయేదేమీ లేదు. ఆ మాటకు వస్తే.. మారిన తీరుతో మస్తు మైలేజీ తప్పించి మరింకేమీ లేదనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా ఆరేళ్ల నుంచి ఉన్నా.. గతంలో ఎప్పుడూ.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వ్యవహరించనంత భిన్నంగా కేసీఆర్ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. కరోనా వేళ.. అన్ని అంశాల్ని తన చేతుల్లోకి తీసుకోవటమే కాదు.. తానే స్వయంగా మార్గదర్శనం చేస్తున్నారు.

ప్రపంచం మొత్తాన్ని ప్రభావితం చేసిన కరోనాకు చెక్ పెట్టేందుకు వీలుగా.. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలన్నట్లుగా ఆయన తీరు ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడు అన్ని విషయాల్ని తానే స్వయంగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో దాదాపు ప్రతి రెండు రోజులకు ఒకసారి (సుమారు) మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అన్ని విషయాల్నితానే స్వయంగా ప్రజలకు చెప్పేస్తున్నారు. ఇలా తరచూ మీడియా సమావేశాల్ని నిర్వహించే అలవాటు కేసీఆర్ కు లేదు. ఒక రకంగా చెప్పాలంటే.. కరోనా అప్డేట్స్.. కేసీఆర్ స్పెషల్ బులిటెన్ తరహాలో మీడియా ముందుకు వచ్చి.. తాను చెప్పాల్సిన అన్ని అంశాల్ని చెప్పేస్తూ.. ప్రజల్లో ధైర్యాన్ని.. ఆత్మవిశ్వాసాన్ని.. హెచ్చరికల్ని చేస్తున్నారు. అదే సమయంలో.. కొన్ని ప్రశ్నలు అడిగిన మీడియా ప్రతినిధులపై శివాలెత్తుతూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆదివారం నాటి ప్రెస్ మీట్ లో.. ఇలాంటి ఎక్స్ ట్రా మాటలే వద్దందన్న ఆగ్రహాం వ్యక్తం చేస్తూనే.. సారీ.. ఎక్స్ ట్రా మాటలకు ఎక్స్ ట్రా సమాధానమే ఇవ్వాల్సి వస్తుందంటూ విరుచుకుపడటం గమనార్హం.
Tags:    
  • Kcr Talking About Corona Virus 
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో క‌విత స‌త్తా చాటేనా?

2026-11-11 17:30 GMT

సోనియా గాంధీ ఒక స్పై.. ఆమె రాగానే గాంధీ కుటుంబంలో హత్యలు.. కంగన సంచలన ఆరోపణలు

2026-11-11 16:47 GMT

షర్మిలమ్మను మురిపించిన సోనియమ్మ

2026-11-11 16:45 GMT

సాయి రెడ్డి పీఆర్‌పీ.. కొన్ని కీల‌క 'గ‌మ్మ‌త్తులు'.. !

2026-11-11 16:41 GMT

చంద్ర‌బాబు హ‌ర్ట్‌: అమిత్ షా విశాఖ ప‌ర్య‌ట‌న ర‌ద్దు రీజ‌న్ ఇదే!

2026-11-11 16:40 GMT

కశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రదాడి.. 30 రౌండ్ల కాల్పులు

2026-11-11 16:34 GMT

క్యాన్సర్ నుంచి అల్జీమర్స్ వరకు ఏ రోగాలు ఉండవు.. ఏఐతో అన్నీ మటాషేనట..!

2026-11-11 12:15 GMT

కొత్త కోవిడ్ వేరియంట్ PJ.2.1.. మళ్లీ కరోనా భయం అవసరమా?

2026-11-11 11:25 GMT

భార్య మృతదేహాన్ని ముక్కలుగా చేసి పడేశాడు.. హత్య కేసులో ఎన్నారై దోషిగా నిర్ధారణ

2026-11-11 11:24 GMT

డిసెంబర్ నుంచే డేంజర్ బెల్స్.. హైదరాబాద్ కు పొంచి ఉన్న పెను ముప్పు

2026-11-11 10:36 GMT

హాట్ టాపిక్ : విజయసాయిరెడ్డి వెంట నందమూరి తారకరత్న భార్య

2026-11-11 09:41 GMT

ఇప్పటికింకా నా వయసు నిండా 18.. అంటే ఇన్ స్టాగ్రామ్ ఇక ఊరుకోదు..

2026-11-11 09:38 GMT

Copyright @2026

Powered by Blink CMS