హరీశ్ విషయంలో అలా.. కేటీఆర్ విషయంలో ఇలా.. ఇదేంది కేసీఆర్?
దుబ్బాక ఎన్నిక ఈ మధ్యనే ముగిసింది. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందరూ ఇప్పుడు ఆ విషయాలే మాట్లాడుకుంటున్నారు. అయితే.. ఈ రెండు ఎన్నికల మధ్య ఉన్న ఒక వ్యత్యాసం గురించి చాలామంది గుర్తించలేదు. ఆ మాటకు వస్తే.. కొమ్ములు తిరిగిన మీడియా సంస్థలు సైతం ఈ విషయాల్ని కనీసం ప్రస్తావన కూడా చేయలేదు. తెలంగాణ అధికారపక్షంలోని లుకలుకల్ని బయట పెట్టేలా ఉన్న దుబ్బాక.. గ్రేటర్ ఎన్నికల విషయంలోకి వెళితే..
దుబ్బాక ఉప ఎన్నిక బాధ్యతను టాస్క్ మాస్టర్ హరీశ్ కు అప్పజెప్పారు. తాజాగా జరుగుతున్న గ్రేటర్ ఎన్నికల బాధ్యతను మంత్రి కేటీఆర్ కు అప్పచెప్పారు గులాబీ బాస్ కేసీఆర్. దుబ్బాక ఎన్నిక మొత్తాన్ని తానే బరిలో నిలిచినట్లుగా హరీశ్ వ్యవహరించారు. తాను పోటీ చేసే సిద్ధిపేటలో కూడా అంతలా కష్టపడలేదేమో. అంతలా హరీశ్ కష్టపడుతున్న వేళలో.. ఆయన ఇమేజ్ పెరిగేలా కేసీఆర్ సొంత మీడియాలోనూ హరీశ్ కు ప్రాధాన్యత ఇచ్చింది లేదని చెప్పాలి. మరింత బాగా అర్థం కావాలంటే.. ఒక చిన్న ఉదాహరణ ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంది.
దుబ్బాక ఉప ఎన్నికల హడావుడి జోరుగా సాగుతున్న సమయంలో ఒక రోజు హైదరాబాద్ లో చెత్త నుంచి విద్యుత్ ను ఉత్పత్తి చేసే యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అదే రోజు దుబ్బాకలో హరీశ్ తీవ్రస్థాయిలో బీజీపీపై విరుచుకుపడ్డారు. ఈ రెండు అంశాల్లో ఏది ప్రధానమైనది? దేనికి గులాబీ బాస్ మీడియా సంస్థ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటే.. దుబ్బాకకు అని చెబుతారు ఎవరైనా.
కానీ.. అందుకు భిన్నంగా కేటీఆర్ ప్రారంభించిన చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ ప్రారంభోత్సవాన్ని హైలెట్ చేస్తూ.. బ్యానర్ వార్తగా ఇస్తే.. బీజేపీ నేతల్ని తిడుతూ మంత్రి హరీశ్ చేసిన వ్యాఖ్యల్ని అప్రాధాన్యంగా ఇచ్చారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలానే కనిపిస్తాయి. ఇలా.. ప్రచారం విషయం దగ్గర నుంచి.. దుబ్బాకలో హరీశ్ కు తోడుగా నిలిచిన నేతలు ఎందరు? చివరకు ముఖ్యమంత్రి సైతం దీని గురించి మాట్లాడింది లేదు.
తాజాగా గ్రేటర్ ఎన్నికల్ని చూస్తే..62 మంది ఎమ్మెల్యేలు.. డజనుకు పైగా మంత్రులు.. ఎమ్మెల్సీలు.. ఎంపీలు.. వేలాది మంది కిందిస్థాయి నేతలు హైదరాబాద్ కు వచ్చేయటమే కాదు.. పాగా వేశారు కూడా. కేటీఆర్ నోటి నుంచి ప్రతి మాటకు గులాబీ బాస్ సొంత మీడియాలో ఇస్తున్న ప్రాధాన్యత గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ఇదంతా చూసినప్పుడు.. యువరాజును గెలుపు గుర్రంగా చూపేందుకు.. తిరుగులేని నాయకత్వ లక్షణాలు ఉన్నట్లుగా ఫోకస్ చేయటం కోసం కేసీఆర్ పడుతున్న పాట్లు కనిపిస్తాయి.
అదే సమయంలో.. హరీశ్ ఎప్పటికి కేటీఆర్ కు సమానం కానే కాదన్న విషయాన్ని చెప్పేలా చేస్తున్న తీరు.. టీఆర్ఎస్ లోని లుకలులు బయటపడేలా చేస్తున్నాయని చెప్పక తప్పదు. జరుగుతున్న పరిణామాలపై హరీశ్ వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తమలో గూడుకట్టుకున్న ఆవేదనను గులాబీ బాస్ వరకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా చెబుతున్నారు. ఎన్నికలు ఏవైనా గెలుపు ఓటములే ముఖ్యం. అలాంటప్పుడు దుబ్బాకనుగ్రేటర్ మాదిరి ప్రతిష్ఠాత్మకంగా.. సీరియస్ గా కేసీఆర్ అండ్ కో ఎందుకు తీసుకోనట్లు?