హోదాపై కేసీఆర్ సపోర్ట్.. ఎంతవరకు నమ్మగలం?
ఏపీ ప్రత్యేక హోదా మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. హోదా వచ్చేందుకు ఏపీకి తమ సహకారం అందిస్తామని చెప్పారు. కేసీఆర్ లాంటి అధినేత ఏపీ మీద ఇంత కరుణను ప్రదర్శించటం ఎందుకు? ఇదే కేసీఆర్.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే.. మన దగ్గరి కంపెనీలు ఏపీకి తరలిపోతాయన్న ఆందోళన వ్యక్తం చేసిన వైనాన్ని ఎందుకు మర్చిపోయారు? ఏపీ ప్రత్యేక హోదా కోసం మోడీ సర్కారుపై లోక్ సభలో తెలుగుదేశం పార్టీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానానికి సోదర తెలుగు రాష్ట్రంగా ఎందుకు సపోర్ట్ చేయలేదు?
విభజన కారణంతో ఏపీ అన్ని విధాలుగా నష్టపోయిందని.. ఆదుకోవాల్సిన అవసరం లేదా? అని కేసీఆర్ పార్టీ ఎంపీలు ఎందుకు నిలదీయలేదు? ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇచ్చి తీరాల్సిందేనని చెప్పిన కేసీఆర్.. తాజాగా మాత్రం తన పాత మాటను మరిచి.. కొత్త మాటను ఎందుకు చెప్పినట్లు? దాని వెనకున్న కారణం ఏమిటి? అని ఆంధ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో సోనియాగాంధీ వచ్చి హైదరాబాదులో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తాం అంటే... తెలంగాణ గడ్డపై ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటిస్తారా? అంటూ టీఆర్ ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ సమాజం కాంగ్రెస్ను దూరం పెట్టింది. అదే సమయంలో హరీష్ రావు మాట్లాడుతూ ఏపీకి ఈ కాంగ్రెసోళ్లు ప్రత్యేక హోదా ఇస్తారట... ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణ ఆగైతది అన్నారు.
సరే ఇవన్నీ మరిచిపోయి ఒకవేళ కేసీఆర్ మాటల్లో నిజమే ఉందనుకుంటే.. పోలవరానికి వ్యతిరేకంగా సుప్రీంలో ఆయన ఎందుకు పిటిషన్ దాఖలు చేసినట్లు? హోదాకు వ్యతిరేకం కాదన్నప్పుడు.. జాతీయ వేదికల మీద ఇప్పటివరకూ ఒక్కసారి కూడా హోదాకు అనుకూలంగా ఎందుకు మాట్లాడనట్లు? అన్నది ప్రశ్న. ఇక.. కేసీఆర్ మాటలు.. నీళ్ల మీద రాతలు లాంటివన్న విషయాన్ని మర్చిపోకూడదు. తెలంగాణ రాష్ట్రం వస్తే.. దళితుడు తొలి ముఖ్యమంత్రి కావాలని.. లేని పక్షంలో మెడ కోసుకుంటానని మాటలు చెప్పిన కేసీఆర్.. చేతల్లో ఏం చేశారో తెలిసిందే. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి విషయంలోనే కేసీఆర్ మాట మీద ఎంతలా నిలబడ్డారో చూసినప్పుడు.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో మరెంత కమిట్ మెంట్ తో ఉంటారో చెప్పాల్సిన అవసరమే ఉండదని చెప్పక తప్పదు.