మోడీకి తనకు పోలిక ఏంటో చెప్పిన కేసీఆర్
వరుస విజయాలతో కారు జోరును కొనసాగిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి - గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజగా పాలేరు ఉప ఎన్నికలో బంపర్ మెజార్టీతో తమ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు గెలవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తుమ్మల విజయం అనంతరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలపై విరుచుకపడ్డారు. అదే సమయంలో తనను ఎందుకు ప్రజలు గెలిపిస్తున్నారో చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని సీన్ లోకి తీసుకొచ్చారు.
నిజాలు మాట్లాడే వారుంటే, అభివృద్ధి అండగా ముదుకుపోతుంటే అలాంటి నాయకులను ప్రజలే ఆదరిస్తారని కేసీఆర్ తెలిపారు. గుజరాత్ లో నరేంద్ర మోడీని ప్రజలు ఎన్నిసార్లు ముఖ్యమంత్రిగా గెలిపించారో అందరికి తెలుసన్నారు. నవీన్ పట్నాయక్ ఒడిశా రాష్ర్టానికి నాలుగుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా రెండోసారి అఖండ విజయం సాధించడం వెనుక మర్మం కూడా ఇదేనని కేసీఆర్ తెలిపారు. మంచి పనులు చేస్తే ప్రజలే గుండెలకు హత్తుకుంటారనేందుకు ఇవే నిదర్శనాలని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత జరుగుతున్న ప్రతి ఎన్నికలోనూ టీఆర్ ఎస్ ను గెలిపిస్తున్నది కూడా ఇదే అభిమానమని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలో సాగునీటి ప్రాజెక్టుల ఆధారంగా తనపై విమర్శలు చేస్తున్న పొరుగు రాష్ట్రం నేతలపై కేసీఆర్ మండిపడ్డారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కు ఎక్కడా పనిపాటలేదని, తెలంగాణపై అసత్య ప్రచారాలు చేయడమే పనిగా పెట్టుకున్నారని కేసీఆర్ విమర్శించారు. హైదరాబాద్ పై వారు అసత్య ప్రచారాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.60 వేల కోట్లు వచ్చే హైదరాబాద్ ను వదులుకున్నామని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ బాబు తీరును తప్పుపట్టారు. గతంలో సీఎంగా పనిచేసి ప్రస్తుతం ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తోన్న వ్యక్తి ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.