• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  3 గంటల కేసీఆర్ స్పీచ్ ని...

3 గంటల కేసీఆర్ స్పీచ్ ని మూడు ముక్కల్లో చెబితే..?

By - Tupaki Desk
Update: 2016-03-31 15:43 GMT
తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల అంశంపై తెలంగాణ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కల ఎట్టకేలకు నెరవేరింది. ప్రజాప్రతినిధులతో పాటు.. యావత్ తెలంగాణ ప్రజానీకానికి ఇరిగేషన్ విషయంలో దశాబ్దాలుగా జరిగిన మోసం కళ్లకు కట్టినట్లుగా చెప్పటం.. ఇదంతా సమైక్యపాలనలోనే చోటు చేసుకుందన్న విషయాన్ని స్పష్టం చేయటం కనిపిస్తుంది.

మూడు గంటలకు పైగా అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి ఒకే అంశంపై నాన్ స్టాప్ గా మాట్లాడటం.. అది కూడా రాజకీయంగా విమర్శలు.. పంచ్ డైలాగులు కాకుండా కేవలం సబ్జెక్ట్ ను మాత్రమే చెప్పటం ఒక ఎత్తు అయితే.. ఆ చెప్పిన విషయాలన్నీ అందరికి అర్థమయ్యేలా.. సామాన్యుడికి సైతం పూర్తిస్థాయి అవగాహన కలిగేలా చెప్పటం మరో విశేషంగా చెప్పాలి.

మూడు గంటల పాటు ఒక సీఎం నాన్ స్టాప్ గా ఒక విషయాన్ని చెప్పుకుంటూ పోయిన విషయాన్ని పక్కన పెడితే.. కేసీఆర్ చెప్పిన మాటల్ని మూడే మూడు ముక్కల్లో.. లేదంటే మూడు పాయింట్లలో చెప్పాల్సి వస్తే  ఏం చెబుతారు? అన్నది అత్యంత ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే.. అంత భారీ ప్రసంగాన్ని మూడు పాయింట్లలో తేల్చే ప్రయత్నం చేస్తే..

1.        వందల ఏళ్ల నుంచి తెలంగాణ ప్రాంతంలో ఇరిగేషన్ వ్యవస్థ అద్భుతంగా ఉండేది. అలా ఉండే వ్యవస్థ సమైక్యపాలనలో భ్రష్ఠు పట్టించారు. తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేశారు.

2.        తెలంగాణలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న నీటి కటకటకు కాంగ్రెస్.. తెలుగుదేశం పార్టీల దుర్మార్గ పాలన. తెలంగాణకు ద్రోహం చేసి.. ఆంధ్రాకు నీటిని తరలించారు. సరిహద్దు రాష్ట్రాల మాదిరి తెలివిగా వ్యవహరించారు.

3.        జరిగిన తప్పుల్ని సరిదిద్దటం. అదంత తేలికైన విషయం కాని నేపథ్యంలో.. సరిహద్దు రాష్ట్రాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ.. రీడిజైనింగ్ ద్వారా ప్రాజెక్టుల్ని పూర్తి చేయటం. తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు ఇవ్వటం.
Tags:    
  • KCR 
  • Powerpoint Presentation 
  • Irrigation Projects 

Similar News

ట్రంప్, పుతిన్, జిన్‌పింగ్.. ప్రపంచ గతి మార్చగలిగే ముగ్గురి ముచ్చట..

2026-11-19 13:20 GMT

స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్.. టీవీకే ఎమ్మెల్యే వీఎస్ బాబు కన్నుమూత

2026-11-19 12:31 GMT

వైసీపీలో రోజాకు సెగ పెడుతోందెవ‌రు... ?

2026-11-19 12:30 GMT

స్థానిక పీఠాల పై మంత్రుల సతీమణులు.. సర్పంచ్‌గా బీసీ జనార్దన్ రెడ్డి భార్య, ఎంపీపీగా మండిపల్లి సతీమణి!

2026-11-19 12:29 GMT

వైసీపీలో 'మూడు' నియ‌మాలు.. జ‌గ‌న్ స‌మాలోచ‌న‌!

2026-11-19 11:30 GMT

వెయ్యిమంది కాదు బ్రో.. ఒకే సారి 15 వంద‌ల మంది!

2026-11-19 10:30 GMT

ఏపీలో అన్ని పార్టీల‌కు ఇదే స‌మ‌స్యా... వార్నింగ్‌ల‌తో స‌రా..?

2026-11-19 10:03 GMT

విజ‌య‌న‌గ‌రం.. బాబు వ‌రం ఎవ‌రికి?

2026-11-19 09:55 GMT

కష్టజీవులకు భరోసా.. నిర్మాణ రంగానికి ఊతం : ఏపీలో ‘లేబర్ అడ్డా’ల విప్లవం!

2026-11-19 08:05 GMT

రూ.7 కోట్ల ఉద్యోగాల స్కాం : కుట్ర జరిగిందంటున్న జనసేన నేతలు.. అసలు నిజం ఇదే!

2026-11-19 08:02 GMT

ఆకాశంలో అంబానీ 'సిగ్నల్'.. మస్క్‌కు ఇక టెన్షన్ షురూ.. ఇప్పుడు స్పేస్‌లో శాటిలైట్ల జాతర

2026-11-19 06:00 GMT

వాన్స్‌కు షాక్ ఇవ్వనున్న ట్రంప్.. 2028 రేసులో రూబియో పేరు!

2026-11-19 05:37 GMT

Copyright @2026

Powered by Blink CMS