ఏపీ రైతుకు కేసీఆర్ ఫోన్.. వైరల్

Update: 2020-12-20 07:15 GMT
రైతులంటే కేసీఆర్ కు ప్రాణం.. ఎందుకంటే కేసీఆర్ కూడా ఒక రైతు కాబట్టి. తన ఫాంహౌస్ లో అల్లం, సహా వాణిజ్య పంటలను కేసీఆర్ సాగు చేస్తుంటాడు. అందుకే ఏ రైతు బాగా పండించినా ఆహ్వానించి సత్కరిస్తుంటాడు. అప్పట్లో ఆదిలాబాద్ రైతు ఆపిల్ పండిస్తే రప్పించి సన్మానించాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ రైతుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్ చేసి అభినందించడం వివేషం. దీంతో ఆరైతు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

కేసీఆర్ మొదటి నుంచి రైతు పక్షపాతి. అందుకే వారికోసం తెలంగాణలో చాలా చేశాడు. కాళేశ్వరం కట్టాడు. వేలకోట్లతో రైతు అనుకూల సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. రాష్ట్ర ఖజనాలో సగానికి పైగా డబ్బులు వ్యవసాయ రంగానికే ఖర్చు పెడుతున్నారంటే  కేసీఆర్ కు రైతులపై ప్రేమను అర్థం చేసుకోవచ్చు.  తాజాగా కేసీఆర్ ఏపీ రైతుకు ఫోన్ చేసి అభినందించడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కృష్ణాజిల్లా ఘంటసాల మండలం ఘంటసాలపాలేనికి చెందిన ఆదర్శ రైతు ఉప్పల ప్రసాదరావుతో సీఎం మాట్లాడి ఫోన్లో మాట్లాడారు. సీడ్రిల్‌ ఆధునిక వ్యవసాయ యంత్రాలు.. వాటితో వెద పద్ధతిలో సాగు అంశాలపై కేసీఆర్ రైతును అడిగి వివరాలను తెలుసుకున్నాడు.

సన్నరకం వరి సాగుచేసిన ప్రసాదరావు 35ఎకరాల్లో సీడ్రిల్ ఉపయోగించి ఎకరానికి 40-45 బస్తాల దిగుబడి సాధించాడు. దీంతో రైతు ప్రసాదరావును కేసీఆర్ అభినందించడంతో ఒకసారి హైదరాబాద్ వచ్చిన తనను కలువాలని కోరారు.అదేవిధంగా ప్రసాదరావును తెలంగాణలో వ్యవసాయ పద్ధతులను పరిశీలించాలని కోరినట్టు తెలుస్తోంది. పక్కా రాష్ట్రంలోని రైతు శ్రమను కూడా గుర్తించి కేసీఆర్ అభినందించడంతో  వ్యవసాయ రైతల విషయంలో కేసీఆర్ ఎంత ఫోకస్డ్ గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
Tags:    

Similar News