రెండు ప్ర‌త్యేక విమానాల్లో తిరుప‌తికి కేసీఆర్‌

Update: 2017-02-21 14:25 GMT
ఏడు కొండల వాడి మొక్కు తీర్చుకునేందుకు వెళుతున్న తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ తిరుప‌తి ప‌ర్య‌ట‌న అనుకున్న దానికంటే మ‌రింత రిచ్ గా సాగుతోంది. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి తిరుపతికి  రెండు ప్రత్యేక విమానాల్లో మంత్రులు బయలుదేరారు. మొదటి విమానంలో స్పీకర్ మధుసూదనాచారి - మంత్రులు హరీశ్‌ రావు - ఇంద్రకరణ్‌ రెడ్డి - ఈటల రాజేందర్ - పద్మారావు - పోచారం తదితరులు తిరుపతి వెళ్లారు. మరో ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి బ‌య‌ల్దేరారు. ఈ మేరకు స్పీకర్‌, మంత్రులు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు స‌మ‌యంలోని మొక్కుల‌ను తీర్చుకునేందుకు  సీఎం కేసీఆర్ తిరుమలకు వెళ్తున్న విషయం తెలిసిందే.

కాగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బేగంపేట ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న సంద‌ర్భంగా కారులో నేరుగా రన్‌ వే మీద ఉన్న‌ విమానం వరకూ వెళ్లారు. కారు దిగి ప్రత్యేక విమానం ఎక్కి తిరుపతి బయలుదేరారు. కేసీఆర్‌ తోపాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేక విమానంలో తిరుపతి బయలుదేరారు. ఈ నేపథ్యంలో రేణిగుంట ఎయిర్‌ పోర్టులో సీఎం కేసీఆర్‌ కు ఘనస్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. కేసీఆర్‌ రేపు ఉదయాన్నే స్వామివారిని దర్శించుకోనున్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున రూ.5.59 కోట్ల విలువైన బంగారు అభరణాలను సీఎం కేసీఆర్ శ్రీవారికి సమర్పించనున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News