• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ పై కత్తి షాకింగ్...

పవన్ పై కత్తి షాకింగ్ వ్యాఖ్యలు..

By - Tupaki Desk
Update: 2019-11-06 07:53 GMT
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంటే చాలు.. చెలరేగిపోయే మహేశ్ కత్తి మరోసారి చెలరేగిపోయారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన పోస్టు సంచలనంగా మారటమే కాదు.. పెను దుమారానికి కారణమైంది. విశాఖలోని జనసైనికులతో భేటీ సందర్భంగా.. వారిని ఉద్దేశించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై పవన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై కత్తి మహేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఏపీ రాజధానిని పులివెందులలో.. హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలపై తీవ్రంగా రియాక్ట్ అయిన కత్తి మహేశ్ ఘాటుగా రియాక్ట్ అవుతూ.. ఏరా పవన్ అంటూ సంబోధనతోనే వివాదాగ్నిని రగిల్చారు. వాస్తవానికి పవన్ చేసిన తాజా వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇలాంటివేళ..వారికంటే పది అడుగులు ముందుకు వేసిన కత్తి మహేశ్.. సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు.

'ఏరా పవన్ కళ్యాణ్... పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండు కావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !!' అంటూ ఫేస్ బుక్ లో పోస్టు పెట్టారు. దీనిపై నెటిజన్ల స్పందన వేర్వేరుగా ఉంది. ఇదేం భాష.. ఇలా మాట్లాడొద్దన్న నెటిజన్ సలహాపై కత్తి స్పందిస్తూ.. పవన్ లాంటి బాధ్యత లేని బరితెగించిన బానిసకు ఇంతకు మించిన మంచి బాష తన దగ్గర లేదన్నారు.

నిజానికి తాను చాలా మర్యాదగానే ఇప్పటికి పోస్టులు పెడుతున్నానంటూ సెలవిచ్చారు. విశాఖ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఇప్పటివరకూ తీస్తా.. తీస్తా అని అనటమే కానీ వాడు తీసిన తాటా లేదు.. తోలూ లేదు. తొక్కా లేదు.. చిల్ చిల్.. అల్రెడీ వాడిగా వాడి గుండు ఒకసారి.. వేడిగా ఓటమి రెండుసార్లు తగిల్చి జనాలే తేల్చేశారు.. ఇక ఆపమనండి మాడా యవ్వారాలు.. అంటూ కస్సుమన్నారు కత్తి. ఇప్పుడీ వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి.
Tags:    
  • Kathi Mahesh 
  • Pavan Kalyan 
  • Janasena 
  • Thata Theestha 
  • Tholu Theestha 
  • Tupaki News 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS