• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కంగనా ఆఫీసు...

కంగనా ఆఫీసు కూల్చివేత...ఖండించిన మహారాష్ట్ర గవర్నర్

By - Tupaki Desk
Update: 2020-09-10 10:30 GMT
సుశాంత్ సూసైడ్ కేసు వ్యవహారం నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్, పోలీసులకు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు మధ్య వివాదం జరుగుతోన్న సంగతి తెలిసిందే. కంగనాకు బీజేపీ మద్దతుండంటూ ప్రచారం జరుగుతుండగా...కంగన వ్యాఖ్యలపై శివసేన నేతలు మండిపడుతున్నారు. తాజాగా ముంబైలోని కంగనా ఆఫీసును బృహణ్ ముంబై మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో ఉద్ధవ్ సర్కార్ తీరును తప్పుబట్టిన కోషియారీ.... కంగన ఆఫీసు కూల్చివేత తదితర పరిణామాలపై కేంద్రానికి నివేదిక సమర్పించాలని నిర్ణయించుకున్నారు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఈ ఘటనను ఖండించారు.

తన ఆఫీస్ కూల్చివేసిన తర్వాత కూడా ఉద్ధవ్ సర్కార్ పై కంగనా మాటలదాడి కొనసాగించింది.సినీ మాఫియాతో జతకట్టి తన ఇల్లు కూల్చి ప్రతీకారం తీర్చుకున్నారని, ఏదో ఒకరోజు మీ అహంకారం కూడా కూలిపోతుందని ఉద్ధవ్ ను ఉద్దేశించి కంగనా పరోక్షంగా ట్వీట్ చేసింది. కశ్మీరు నుంచి పండిట్లను తరిమివేసినప్పుడు వారు పడిన బాధ తనకు అర్థమైందని, అయోధ్యతోపాటు కశ్మీరుపై కూడా సినిమా తీస్తానని కంగనా సంచలన వ్యాఖ్యలు చేసింది. ముంబై రహదారులు అధ్వాన్నంగా ఉన్నా సర్కార్ కు పట్టలేదని, ఓ నటి ఇల్లు కూల్చడంపై శ్రద్ధ పెట్టారని విమర్శించింది. తాను అన్నట్లుగానే ముంబై ఇప్పుడు పీవోకే అయిందని,  ప్రజాస్వామ్యం మరణించిందని ట్వీట్ చేసింది.
Tags:    
  • Bollywood 
  • Bollywood News 
  • Bollywood Latest Updates 
  • Bollywood Daily News 
  • Bollywood Heroes 
  • Hindi News 
  • Hindi Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS