కమ్మ ఉద్యమం కూడా వస్తుందా?

Update: 2016-02-01 11:43 GMT
కాపు ఉద్యమంలో రాష్ట్రంలో కులాల మధ్య పోరును మరోమారు తెరపైకి తెచ్చింది. అయితే... సమాజంలో ఇప్పుడు అగ్రకులాలుగా చలామణీ అవుతున్న కమ్మ, తెలగ కులాలు ఒకప్పుడు వెనకబడిన కులాలేనట. 1915లో బ్రిటిషర్లు మద్రాసులో విడుదల చేసిన 'ద ఫోర్ట్‌ సెయింట్‌ జార్జ్‌ గెజిట్‌' ప్రకారం చూస్తే కమ్మ - కాపు కులాలూ రెండూ ఒకప్పుడు వెనుకబడిన కులాలే. 1915 జూన్‌ 15న విడుదలైన ఆ గెజిట్‌ లో మొత్తం 124 కులాలతో బీసీ జాబితాను అధికారికంగా ప్రకటించారు. ఇప్పుడు బీసీల్లో ఉన్న అనేక కులాలు అప్పట్లోనూ ఆ జాబితాలో ఉన్నాయి. వాటితోపాటే.. కమ్మ, తెలగ(కాపు) కులాలు అందులో ఉన్నాయి.

దాని ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ కాపులను బీసీల్లో చేర్చితే కమ్మ వర్గం కూడా తమను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేసే అవకాశముందని భావిస్తున్నారు.  ఇప్పటికే కొందరు ఆ దిశగా అధ్యయనం మొదలుపెట్టారని కూడా తెలుస్తోంది.

మరోవైపు చంద్రబాబు కాపుల‌ను బీసీల్లో చేరుస్తాన‌ని అంటున్నారు... ప్రస్తుతం ఉన్న బీసీ రిజ‌ర్వేష‌న్ల‌కు ఇబ్బందులు లేకుండా కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తే మ‌ద్రాస్ ప్రభుత్వ పాల‌న‌లో బీసీలుగా ఉన్న క‌మ్మ సామాజిక‌వ‌ర్గం కూడా ఇప్పుడు త‌మ‌ను కూడా బీసీల్లోకి చేర్చాల‌ని ఉద్యమం లేవ‌దీసే అవకాశాలున్నాయి. అదే జరిగితే ప్రతి అగ్రవర్ణం ఉద్యమబాట పట్టే ప్రమాదముంది. దీంతో కాపు రిజర్వేషన్ల అంశం ఎలంటి టర్ను తీసుకుంటుందో అని అంతా ఆసక్తిగా చూస్తున్నారు.

Tags:    

Similar News