తన రూటే సప ‘రేటు’ అంటున్న కేఏ పాల్
తెలుగు రాష్ట్రాల్లో కేఏ పాల్ గురించి తెలియనివారు ఉండరంటే అతిశయొక్తి కాదేమో. కేఏ పాల్ ను కేవలం కేవలం మతప్రచారకుడిగానే చూడరు. ఆయ గురించి ఎవరినీ అడిగినా చెబుతారు.. ఆయన రూటే సపరేటే అని.. కేఏ పాల్ ఎప్పుడు మీడియా ముందుకొచ్చినా ఏదో ఒకటి సంచనలం అవుతుంటుంది. సీరియస్ గా కామెడీ చేస్తారనే ప్రజల్లో టాక్ ఉన్నా ఆయనలో ప్రజలకు ఏదో సేవ చేయాలనే తపన మాత్రం కనిపిస్తుంది.
కేఏ పాల్ 2009లో ప్రజాశాంతి పార్టీ పెట్టి కాంగ్రెస్ వ్యతిరేకంగా టీడీపీ అనుకూలంగా ప్రచారం చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఆయన పార్టీకి డిపాజిట్లు కూడా రాలేదు. అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్న కేఏ పాల్ అడుపదడుపా మాత్రం మీడియాలో హడావుడి చేసేవారు.
ఏపీలో ఇప్పుడు జరుగనున్న ఎన్నికల్లో ప్రతీ ఓటు కీలకంగా మారనుంది. ఈ సమయంలో కేఏ పాల్ ఏపీ ప్రజలకు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ప్రజాశాంతి పార్టీలో యువకులు వెయ్యి మంది కార్యకర్తలను చేర్పిస్తే వారికి ఉద్యోగాల్లో ప్రాముఖ్యత ఇవ్వడంతోపాటు వారికి ఉద్యోగం వచ్చేంత వరకు నెలకు రూ.3వేల నిరుద్యోగ భృతి ఇస్తామంటూ ప్రకటించారు. అంతేకాదు తన పార్టీ తరఫున ఎమ్మెల్సేలను గెలిపించిన నియోజకవర్గాలకు రూ.100 కోట్లు రూపాయాలు తన చారిటీ తరఫున ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తానని కేఏ పాల్ హామీ ఇచ్చారు.
తనతో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు టచ్ లో ఉన్నాయని ఆయన తెలిపారు. అంతేకాదు.. జనసేన పార్టీ తనతో కలిసివస్తే పవన్ కల్యాణ్ ను సీఎం చేస్తానని ఆఫర్ ఇచ్చాడు. ఎన్నికలు సమీపిస్తుండటంతో కేఏ పాల్ మళ్లీ తనదైన శైలీలో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెరవెనుక ఏవరో ఉండి కేఏ పాల్ ను నడిపిస్తున్నారనే చర్చ జరుగుతుంది. మరీ కేఏ పాల్ ఈ ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తారా లేక ఎప్పటీలాగే మీడియాలో కొన్ని రోజులు హడావుడి చేసి కనుమరగువుతారో చూడాలి మరీ.
Full View