రావులను జూపల్లి వదిలిపెట్టేటట్లు లేరే..?

Update: 2015-07-15 07:30 GMT
పాలమూరు ప్రాజెక్టు విషయంలో తెలంగాణ అధికారపక్షానికి.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు మధ్య సాగుతున్న మాటల యుద్ధం మరింత ముదిరిపాకాన పడుతోంది. పాలమూరు ప్రాజెక్టు విషయంలో బహిరంగ చర్చకు తాను సిద్ధమని రావుల సవాలు చేయటం.. దానికి స్పందనగా మంత్రి జూపల్లి సై అనటం.. ఎన్టీఆర్ భవన్ లో చర్చ అని చెప్పటం.. దాన్ని తర్వాత అసెంబ్లీ కమిటీ హాల్ మార్చటం లాంటివి చకచకా జరిగిపోయాయి.

ఈ అంశంపై చర్చకోసం సహచర మంత్రి.. ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని మంత్రి జూపల్లి.. అసెంబ్లీ దగ్గర వెయిట్ చేయటం తెలిసిందే. అయితే.. రావుల వివిధ కారణల వల్ల రాలేకపోయారు. ఈ వ్యవహారం ఇక్కడితో ముగిసినట్లు భావించినా.. అలాంటిదేమీ లేదన్నట్లుగా జూపల్లి భావిస్తున్నారు. టీడీపీ నేతలు విసిరిన సవాలుకు తాను కట్టుబడి ఉన్నట్లుగా చెబుతున్న జూపల్లి.. తాను కమిటీ హాల్లోవెయిట్ చేస్తున్నట్లు తాజాగా మరోసారి వెల్లడించారు.

జూలై 13..15..16 తేదీల్లో తాను ఉదయం 11 గంటల నుంచి సిద్ధంగా ఉంటానని లేఖలో పేర్కొన్నట్లే.. జూపల్లి మరోసారి అసెంబ్లీ కమిటీ హాల్ కి వచ్చారు. మరి.. సవాలు విసిరిన రావుల ఈసారైనా వస్తారా? లేరా? చూస్తుంటే.. పాలమూరు ప్రాజెక్టు ఇష్యూలో టీఆర్ ఎస్ నేతల వద్ద గట్టి వాదన సిద్ధంగా ఉన్నట్లుంది. లేకపోతే.. ఒక మంత్రి ఇంతగా చర్చకు సై అనటం ఏమిటన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News