• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పాలనపై బైడెన్​ సమీక్ష.....

పాలనపై బైడెన్​ సమీక్ష.. మీడియాతో సంచలన నిజాలు..

By - Tupaki Desk
Update: 2021-03-26 12:30 GMT
జో బైడెన్​ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి 100 రోజులు పూర్తిచేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. గతంలో ట్రంప్​ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలను, జీవోలను రద్దు చేశారు. ముఖ్యంగా బైడెన్​​ అమెరికాలో నివసిస్తున్న విదేశీయుల హక్కులను కూడా కాపాడుతున్నారు. దీంతో ఆయనకు అన్ని వర్గాల ప్రజల నుంచి మద్దతు దక్కుతున్నది. ఇదిలా ఉంటే బైడెన్​​ తన 100 రోజుల పాలనపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఓ విలేఖరి .. మీరు వచ్చే ఎన్నికల్లో కూడా పోటీచేస్తారా? అని ప్రశ్నించారు.. దానికి జో బైడెన్​ సమాధానం చెబుతూ అందుకు చాలా సమయం ఉందన్నారు.. కానీ పోటీచేసే అవకాశం కూడా ఉందని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆయనకు 78 ఏళ్లు . వచ్చే ఎన్నికల వరకు ఆయన ఆరోగ్యం సహకరిస్తుందో లేదో వేచి చూడాలి.

ఇటీవల ఓ సమావేశానికి వెళ్లబోతుండగా.. జో బైడెన్​ మూడుసార్లు తూలిపడ్డారు కూడా. ఇదిలా ఉంటే తాజాగా తన పాలనపై ఆయన మాట్లాడారు.  అయితే ఆయన అధ్యక్షుడయ్యాక తొలిసారి మీడియా ముందుకొచ్చారు జో బైడెన్​..  వందరోజుల పాలనలో ఏం చేయబోతున్నారో? మీడియాకు చెప్పారు.  తొలి వంద రోజుల పాలన ముగిసే సమయానికి 200 మిలియన్ల డోసుల కరోనా వ్యాక్సిన్ వేయాలన్నది తన లక్ష్యమని చెప్పారు.  2024 ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు జో బైడెన్​ తెలిపారు.

ప్రస్తుతం అమెరికాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. రోజూ సగటున రెండున్నర మిలియన్ల మేర వ్యాక్సిన్లను వేస్తున్నారు. జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్‌ ను 200 మిలియన్ల డోసుల మేర కొనుగోలు చేయనుంది.అలాగే- ఫైజర్, మోడెర్నా నుంచి 600 మిలియన్ల డోసుల మేర వ్యాక్సిన్‌ ను కొనుగోలు చేయడానికి అవసరమైన చర్యలను పూర్తి చేసింది. దశలవారీగా ఈ వ్యాక్సిన్ అందుతుంది.ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉంటోంది. 3,07,74,033 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 5,59,744 మంది మరణించారు.
Tags:    
  • Joe Biden Dog 
  • White House 
  • Joe Biden 
  • Telugu News 

Similar News

మన అల్లుడే అమెరికా ముస్లిం సెనెటర్.. లింకులు కర్ణాటకలో.. అమెరికా రాజకీయాల్లో భారతీయ మూలాలు

2026-11-06 09:24 GMT

'గ్రేట‌ర్‌' విశాఖ‌లో జ‌న‌సేన సునామీ... !

2026-11-06 09:24 GMT

న‌చ్చిన టైం వేస్తామంటే కుద‌ర‌దు బాస్‌: సుప్రీంకోర్టు

2026-11-06 09:22 GMT

జ‌నం ప‌ట్టుబడితే అంతే.. ఏపీలో పోలింగ్ బ‌హిష్క‌ర‌ణ‌!

2026-11-06 09:22 GMT

రూ. 40 కోట్లా? ఐపీఎల్ వేలానికి ముందే ఆటగాళ్ల డిమాండ్లు వైరల్

2026-11-06 07:49 GMT

బోస్టన్‌లో తెలుగు విద్యార్థిని అదృశ్యం.. 36 గంటలుగా జాడలేదు.. అసలేమైంది?

2026-11-06 06:33 GMT

వైఫై, ఎమోజీ, క్యూఆర్ కూడా ఇలా దైనందిత జీవితంలో ఉపయోగించే ఈ అద్భుత ఆవిష్కరణల వెనుక ఉన్న దేశాలేవో తెలుసా?

2026-11-06 06:30 GMT

సోషల్ మీడియా స్వేచ్ఛకు కొత్త సవాల్..

2026-11-06 05:47 GMT

సాధారణ ఉప్పుతో గుండెకు ముప్పు.. పొటాషియం ఉప్పుతో లక్షల ప్రాణాలకు రక్షణ!

2026-11-06 05:02 GMT

కేరళ నుంచి అమెరికా వరకు.. లాస్ ఏంజెలెస్ తొలి భారతీయ సంతతి మేయర్‌గా నిత్యా రామన్!

2026-11-06 04:57 GMT

అమెరికాలో డెమోక్రాట్ల విజయం.. భారతీయులకు H-1B, OPT వీసాల విషయంలో ఊరట లభిస్తుందా?

2026-11-06 04:57 GMT

లైఫ్‌లో సెటిల్ అవ్వడమే కాదు.. నచ్చినట్లు బతకడమే ముఖ్యం! జెన్ జీ కొత్త ట్రెండ్ ఇదే!

2026-11-06 04:19 GMT

Copyright @2026

Powered by Blink CMS