• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తుపాకుల నియంత్రణ బిల్లు.....

తుపాకుల నియంత్రణ బిల్లు.. జోబైడెన్ సంచలన సంతకం

By - Tupaki Desk
Update: 2022-06-26 09:30 GMT
గన్ కల్చర్ తో అట్టుడుకుత నెలలో పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్న అమెరికాలో గొప్ప సంస్కరణకు బీజం పడింది. ఇక అగ్రరాజ్యంలో తుపాకుల విక్రయాలపై నియంత్రణ ఉండనుంది. అమెరికాలో తుపాకుల నియంత్రణ చట్టంపై అధ్యక్షుడు జోబైడెన్ చారిత్రక సంతకం చేశారు. తుపాకుల నియంత్రణకు కొన్ని దశాబ్ధాల తర్వాత తీసుకొచ్చిన అతిపెద్ద చట్టం ఇదే కావడం గమనార్హం.

బిల్లుపై చారిత్రక సంతకం చేశాక జోబైడెన్ సంతోషం వ్యక్తం చేశారు.  ఈ చట్టం చాలా మంది ప్రాణాలను కాపాడనుంది అని ప్రకటించారు. ఇటీవల టెక్సాస్ లోని బఫెలో కాల్పుల ఘటన తర్వాత ఈ బిల్లు తెరపైకి వచ్చింది. ఈ బిల్లు శుక్రవారం ప్రతినిధుల సభలో 234-193 ఓట్ల తేడాతో పాస్ అయ్యింది. బిల్లుకు అనుకూలంగా 14 మంది రిపబ్లికన్లు కూడా ఓటింగ్ చేయడం గమనార్హం.సెనెట్ లో ఆమోదం పోందిన ఈ బిల్లు ఇక అమెరికాలో తుపాకుల నియంత్రణకు ఎంతో దోహదపడనుంది.

జోబైడెన్ మాట్లాడుతూ.. జులై 11వ తేదీన బిల్లుకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ సభ్యులు.. అమెరికాలో తుపాకీ సంస్కృతికి చరమగీతం పాడారని తెలిపారు. బాధితులతో కలిసి సంబరాలు జరుపుకోనున్నట్లు వెల్లడించారు. నేను అనుకున్న ప్రతి ఒక్కటీ ఈ బిల్లు ద్వారా సాధించలేనన్నారు. కాకపోతే ప్రజల ప్రాణాలను కాపాడే నిబంధనలు దీనిలో ఉన్నాయన్నారు. ఇప్పటికీ ఇది సరిపోతుందని.. వాషింగ్టన్ ఏం చేయలేదు అనుకునే సమయంలో మేము కొంత చేశామని తెలిపారు. ఒకవేళ మేము రాజీపడి ఉంటే చాలా కీలక విషయాల్లో వెనక్కి తగ్గాల్సి ఉంటుందని తెలిపారు.

-తుపాకీ నియంత్రణ చట్టంలో ఏముంది?

చట్టం ప్రకారం 21 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న తుపాకీ కొనుగోలుదారుల కోసం కఠినమైన తనిఖీలు ఉంటాయి. గృహ దుర్వినియోగానికి పాల్పడిన వారందరినీ తుపాకీలను కలిగి ఉండకుండా నిషేధించే నిబంధన విధించారు. చట్టం  లొసుగులను తొలగించారు. గతంలో వారి బాధితులను వివాహం చేసుకున్న లేదా వారితో నివసించే వారికి మాత్రమే పరిమితి వర్తిస్తుంది. ఈ చట్టం ఆ రాష్ట్రాలకు ప్రోత్సాహకాలను అందజేస్తుంది. అది తుపాకీలను తాత్కాలికంగా జప్తు చేయడానికి అనుమతించే చట్టాలను ఆమోదించింది. వాటిని కలిగి ఉండటం చాలా ప్రమాదకరమైనదిగా భావించే వ్యక్తుల నుండి తుపాకులను స్వాధీనం చేసుకుంటుంది.
Tags:    
  • Joe Biden 
  • American President 
  • Latest News 
  • Tupaki Updates 
  • Telugu News 

Similar News

ట్రంప్ పట్టుకొచ్చాడు.. అతడు వచ్చాడంటే ‘హెచ్1బీ’లకు మూడినట్టే?

2026-11-12 08:16 GMT

ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?

2026-11-12 08:16 GMT

టేస్ట్ ఆఫ్ ఆంధ్రా' నుంచి డిజిటల్ పర్యాటకం వరకు.. సీఐఐ సదస్సు విశేషాలు!

2026-11-12 06:17 GMT

చీపురుపల్లి టీడీపీలో టెన్షన్.. టెన్షన్.. స్థానికంలో బొత్స దూకుడు

2026-11-12 06:05 GMT

బీబీసీకి ఎదురుదెబ్బ.. ట్రంప్ పరువు నష్టం కేసుకు గ్రీన్ సిగ్నల్!

2026-11-12 06:05 GMT

చాక్లెట్ బాక్సును వదలని ‘బాబు’ గారు.. ఆయన ఆలోచన అలా ఉంటుంది మరీ

2026-11-12 05:54 GMT

రాప్తాడు నిందితుడికి తీవ్ర అనారోగ్యం.. బతికినంతకాలం దుర్భర జీవితమే..!?

2026-11-12 05:49 GMT

జెన్సన్‌కు మస్క్ ఉద్యోగం ఇస్తారా? వివాదం మధ్య ఆసక్తికర ఆఫర్!

2026-11-12 05:49 GMT

ప్రభుత్వం మారినా పెట్టుబడుల ఒప్పందాలు మారకూడదు.. చంద్రబాబు కొత్త ఆలోచన!

2026-11-12 05:48 GMT

క్లీన్ సిటీల జాబితాలో ఏపీ సత్తా.. విజయవాడ, విశాఖ, గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు!

2026-11-12 05:48 GMT

పవన్ పై సోషల్ మీడియాలో రెచ్చిపోతున్న వారికి గట్టి షాక్.. అరెస్ట్

2026-11-12 04:24 GMT

11 లక్షల కోట్ల టార్గెట్ ..దావోస్ కి ధీటుగా వైజాగ్ సమ్మిట్

2026-11-12 03:23 GMT

Copyright @2026

Powered by Blink CMS