పయ్యావులను మంత్రి చేయాల్సిందే అంటున్న జేసీ
తెలుగుదేశం పార్టీ అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరోమారు తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఇవాళ ఆయన సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ ఇమేజ్ ఉన్న నాయకులనే కేబినెట్ లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రికి సూచనలు ఇచ్చినట్లు తెలిపారు. పయ్యావుల కేశవ్ కు మంత్రి పదవి ఇవ్వాలని ఎప్పటి నుంచో సీఎంను కోరుతున్నానని జేసీ తెలిపారు. చంద్రబాబు అందరి ప్రతిపాదనలు వింటున్నారు కాని తన మనసులో ఏముందో ఎవరికీ తెలీదు కదా అని తనదైన శైలిలో జేసీ వ్యాఖ్యానించారు.
కాగా, పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా ఉద్విగభరితం అయ్యారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలంటూ టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నరేంద్ర కలిశారు. ఈ సమయంలోనే ఆయన భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాను పార్టీ కోసం ఎంతో చేశానని ధూళిపాళ్ల చెప్పినట్లు తెలిసింది. కాగా, ప్రభుత్వ విప్, కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి కాస్త సంయమనంతో స్పందించారు. మంత్రి పదవి ఎవరికి వచ్చినా ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. పార్టీ టికెట్ పై గెలిచిన వారికి మంత్రివర్గ విస్తరణలో అవకాశం ఇవ్వాలన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం ఇస్తారని ఆశిస్తున్నట్లు మీడియాతో ఆయన తెలిపారు.
మరోవైపు కడప జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత రామసుబ్బారెడ్డి తనకు దక్కుతున్న ప్రాధాన్యంపై ఘాటుగానే రియాక్టయ్యారు. పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రతిపాదన చేయగా ఆ పదవి తనకు వద్దంటూ సున్నితంగా తిరస్కరించారని తెలిపారు. తన రాజకీయ ప్రత్యర్థి, వైసీపీ నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే ఆదినారాయరెడ్డికి మంత్రి పదవి ఇస్తున్నట్లు తమకు ఎటువంటి సమాచారం లేదని అన్నారు. ఆయన టీడీపీ చేరే రోజునే తన అభిప్రాయాన్ని అధిష్టానానికి తెలిపానని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/