గ్రేటర్ రాయలసీమ.. జగన్ కు జేసీ హెచ్చరిక

Update: 2020-01-14 05:50 GMT
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై మాజీ ఎంపీ - టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు రాజధానుల ప్రకటనపై మండిపడ్డారు. అనంతపురంలో నిర్వహించిన అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో వివిధ పార్టీల నేతలు ప్రజా చైతన్య యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి తాత్కాలిక రాజధాని కాదని.. శాశ్వత రాజధాని అని జేసీ స్పష్టం చేశారు. హైదరాబాద్ లాగానే అమరావతి అని.. అసెంబ్లీ - సచివాలయం - హైకోర్టు ఒకే చోట ఉండాలన్నారు.

కేవలం కులాన్ని, మతాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తారా అని జేసీ ప్రశ్నించారు. రాష్ట్రంలో వైసీపీ సర్కారు పాలన ఇలాగే ఉంటే గ్రేటర్ రాయలసీమ ఉద్యమం వస్తుందని జేసీ తేల్చిచెప్పారు. గ్రేటర్ రాయలసీమగా విడగొట్టి కడపను రాజధానిగా చేసుకోవాలని సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఆరోపించారు.

ఏపీని మూడు రాష్ట్రాలుగా చేయాలని సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని జేసీ సంచలన ఆరోపణలు చేశారు. అదే జరిగితే ప్రత్యేక రాయలసీమ కోసం ఉద్యమం చేపడుతామని ఆయన హెచ్చరించారు.


Tags:    

Similar News