• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇలా అయితే అసలు కుదరదు...

ఇలా అయితే అసలు కుదరదు పవన్...

By - Tupaki Desk
Update: 2022-10-13 04:43 GMT
జనసేనాని పాలిటిక్స్  ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు అంటున్నారు. గంభీరమైన ప్రకటనలు మాత్రం ఆయన నుంచి  ప్రతీసారీ వస్తున్నాయి. కానీ దానికి తగిన విధంగా అడుగులు పడుతున్నాయా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏపీలో వైసీపీని దించేసే విషయంలో పవన్ లో కసి కనిపిస్తుంది. ఆ విషయంలో ఎవరూ వేలు పెట్టి చూపించలేరు. అంతే కాదు వైసీపీ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూస్తాను అని పవన్ అంటున్నారు. అంటే పొత్తు రాజకీయం అని భావించాలి. అది కూడా కరెక్టే అనుకున్నా అసలు జనసేనకు ఉన్న బలం ఎంత అన్నది ఎప్పుడైనా సమీక్ష చేసుకున్నారా అన్నదే ఇపుడు పాయింట్.

ఏపీలో చూస్తే వైసీపీ బలంగా ఉంది. టీడీపీ కూడా ఢీ కొడుతోంది. కానీ జనసేన మూడవ ప్రాంతీయ పార్టీగా సర్దుకునేంత రాజకీయ శూన్యత ఉన్నా కూడా ఎందుకో సరైన విధానాలు అవలంబించకపోవడం వల్లనే పవన్ వెనకబడుతున్నారు అని అంటున్నారు. ఎన్నికలు ఏణ్ణర్ధం వ్యవధిలోకి వచ్చేశాయి. ఇప్పటికి చూసినా మొత్తం 175 నియోజకవర్గాలలో గట్టి నాయకులు ఉన్నారా అన్నది ప్రశ్నించుకుంటే జవాబు లేదు అనే వస్తుంది.

పార్టీని ముందు సంస్థాగతంగా గట్టిపరచుకోవాలి కదా. అభిమానం ఉంటే చాలా. అది ఓట్లుగా మార్చే పార్టీ యంత్రాంగం ఉండేలా చూసుకోవాలి కదా అన్నదే ఇపుడు చర్చగా ఉంది. బూత్ లెవెల్ దాకా పార్టీ క్యాడర్ ని చేరి అక్కడ నుంచి పార్టీ నిర్మాణం చేపడితేనే ఫలితాలు ఆశాజనంగా ఉంటాయి. అంతే తప్ప జనసేన సభలు సమావేశాలు పెట్టినపుడు వచ్చే జనాలను చూసుకుని విజయం ఖాయమనుకుంటే కుదరదు అని అంటున్నారు.

ఇక ప్రతీ మీటింగులో పవన్ సీఎం అని అభిమానులు గట్టిగా కేకలు వేస్తారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో చూస్తే క్యాడర్ పెద్దగా కనిపించదు, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలో చూస్తే పార్టీ బాధ్యులు కానీ నిర్మాణం కానీ ఈ రోజుకు ఉన్నట్లుగా ఏమీ కనిపించదు. అలా జనసేన తన రాజకీయ ప్రస్థానాన్ని సాగిస్తూ వస్తోంది.

ఈ రోజుకీ ఏపీ అంతటా క్షేత్ర స్తాయిలో పార్టీ జెండా మోసేవారిని పార్టీ అజెండా వివరించే వారిని తయారు చేసుకోకపోవడం అతి పెద్ద లోపంగానే చెబుతున్నారు. పార్టీకి అనుకూలమైన  వాతావరణం ఉంది. దాన్ని సొమ్ము చేసుకుంటూ బూత్ లెవెల్ దాకా పార్టీ కమిటీలు వేయడం తరచూ పార్టీకి నిర్దిష్ట కార్యక్రమాలు ఇవ్వడం ద్వారా జనసేనను జనంలో ఉంచేలా చేయడం వంటివి చేయాలి.

పొత్తుల విషయం పక్కన పెడితే మొత్తం 175 సీట్లలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకునే దిశగా కార్యాచరణ‌ ఉండాలని జనసేన మేలుని కోరే వారు అంటున్న మాట. అపుడు ఏపీలో అధికార పార్టీని దించడం కానీ తాము అధికారంలోకి రావడం కానీ జరుగుతుంది అని సూచిస్తున్నారు. జనసేనాని ఆ వైపుగా ఆలోచనలు చేస్తారా. చూడాలి మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    
  • APPolitics 
  • JanasenaParty 
  • PawanKalyan 
  • APAssemblyElections 
  • YSRCPGovernment 
  • TDPParty 
  • PoliticalNews 

Similar News

నెల్లూరుకు సమీపంలో ‘మురసు’.. ఐదు జిల్లాలలో భారీ వర్షాలు

2026-11-02 08:24 GMT

రాప్తాడు బాలిక హెల్త్ బులిటెన్.. కీలక సమాచారం వెల్లడించిన మంత్రి లోకేశ్

2026-11-02 07:56 GMT

ఓడిపోతానని ట్రంప్ కు జ్ఞానోదయం.. ఇన్నాళ్లకు తెలిసి (తెలివి) వచ్చింది..

2026-11-02 07:05 GMT

మారథాన్‌లో విజయం.. జీవితంలో విషాదం.. పరుగుపందెం పూర్తి చేసి ప్రాణాలు విడిచిన టెక్కీ

2026-11-02 06:43 GMT

తొలిరోజే రూ.68 లక్షల జరిమానాలు.. ఢిల్లీలో కాలుష్యంపై యుద్ధం..

2026-11-02 05:28 GMT

నీతా అంబానీ గొప్ప మనసు.. 5 వేల మంది నిరాశ్రయులకు అండగా ‘అనంత్ ఆశ్రయ్’

2026-11-02 04:56 GMT

28 ఏళ్లుగా ప్రపంచ పాదయాత్ర.. 50 వేల కిలోమీటర్లు నడిచిన బ్రిటిష్ సాహసికుడు!

2026-11-02 03:59 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

బాబు ఒక్క ఫోన్ కాల్ తో విజయ్ డీకే ఓకే

2026-11-02 03:53 GMT

ప్రతిపక్షమంతా ఒక్కటిగా...మోడీ షా టార్గెట్ గా !

2026-11-02 03:50 GMT

జగన్ రెడీ అయినట్లేనా ?

2026-11-02 03:48 GMT

సింగిల్స్‌కు ఉచితంగా ఫిన్‌ల్యాండ్ ప‌ర్యట‌న‌కు ఛాన్స్

2026-11-02 03:47 GMT

Copyright @2026

Powered by Blink CMS