'హంగ్' అంటున్న జనసేన మద్దతుదార్లు!

Update: 2019-04-20 01:30 GMT
మొత్తానికి ఎవ్వరూ ఎక్కడా తగ్గడం లేదు. ఎవరికి వారు తమదే హవా అని అంటున్నారు. ఒకవైపు విజయం విషయంలో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు తమ తమ విశ్వాసాలతో ఉన్నాయి. అయితే తెలుగుదేశం పార్టీ ఎన్నికలు జరిగిన తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. 'ఇవి అసలు ఎన్నికలే కాదు..' అని చంద్రబాబు స్టేట్ మెంట్ ఇచ్చారు. దీంతో తెలుగుదేశం పార్టీ విజయం మీద విశ్వాసం వ్యక్తం చేస్తున్నా….  ఇంకా ఏవో అనుమానాలు అని జన సామాన్యం అనుకుంటూ ఉంది.

ఆ సంగతలా ఉంటే.. జనసేన మద్దతుదార్లు అస్సలు తగ్గడం లేదు. ఒకవైపు తమదే అధికారం అని జనసేన విశాఖ అభ్యర్థి లక్ష్మినారాయణ ప్రకటించుకున్నారు. ఆయనే కాదు.. జనసేన మద్దతుదార్లు  అయిన కమ్యూనిస్టు పార్టీల వాళ్లు మరో మాట చెబుతున్నారు. అదేమిటంటే.. ఏపీలో వచ్చేది 'హంగ్' అని వారు అంటున్నారు!

అంటే ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రాదని కమ్యూనిస్టు పార్టీల వాళ్లు అంటున్నారు. వామపక్ష సిద్ధాంత సానుభూతి పరుడు అయిన ఒక ప్రముఖ జర్నలిస్టు.. తన వ్యాసంలో హంగ్ అని పేర్కొనడం విశేషం. వినడానికి ఇది విడ్డూరంగానే ఉన్నా.. ఎవరి లెక్కలు వారివి అని చెప్పక తప్పదు!

వీళ్ల  లెక్కల ప్రకారం.. జనసేన-బీఎస్పీ-కమ్యూనిస్టు పార్టీల కూటమికి భారీగా ఓటింగ్ జరిగిందట. కొన్ని చోట్ల అది ఇరవై ముప్పై శాతం కూడా ఉందట! ఈ మాటలు వినడానికి కొంచెం ఆశ్చర్యం అనిపించవచ్చు. అయితే  వారు మాత్రం ఆ వాదన వినిపిస్తూ ఉన్నారు. తాము విజయం సాధించకపోయినా.. హంగ్ వస్తుందని అంటున్నారు. 'హంగ్ వస్తే తమ కూటమి మద్దతు అసవరం పడుతుంది..' అని చెప్పుకోవడం వీరి తాపత్రయం!
Tags:    

Similar News