వామ్మో.. రోజా ఆస్తి అన్ని కోట్లా.. మొత్తం చెప్పేసిందిగా!

రోజా మాట్లాడుతూ.. "బంగారం బర్తడే కి మాత్రమే కొంటాను. మళ్లీ ఎప్పుడు కొనను. నెలకి రూ .5 లక్షలు వస్తే చాలు కుటుంబమంతా కూడా హ్యాపీగా ఉంటాము .;

Update: 2026-01-21 22:30 GMT

టాలీవుడ్, కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో అలనాటి హీరోయిన్ గా భారీ పాపులారిటీ సంపాదించుకుంది సీనియర్ స్టార్ హీరోయిన్ రోజా. నిజానికి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో వరుస సినిమాలతో డిజాస్టర్ ను మూటగట్టుకొని.. ఐరన్ లెగ్ అనే బిరుదు వేయించుకున్న ఈమె.. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కుతూ తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించి టాలీవుడ్ , కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలలో టాప్ హీరోలతో కలిసి పనిచేసి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది.

అయితే ఎప్పుడైతే రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిందో అప్పుడు సినిమాలను తగ్గించి పొలిటికల్ పరంగా కూడా మంచి పేరు దక్కించుకుంది ఇక ప్రస్తుతం మాజీ మంత్రిగా కొనసాగుతున్న ఈమె అలా ఒకవైపు రాజకీయాలలో కొనసాగుతూనే.. మరొకవైపు వరుస ప్రాజెక్టులతో సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టింది. అందులో భాగంగానే రోజా నటిస్తున్న తమిళ్ చిత్రం లెనిన్ పాండియన్. ఇటీవలే రోజా పాత్రకు సంబంధించి విడుదలైన గ్లింప్స్ కూడా అందరిని ఆకట్టుకుంది.

ఇందులో డీ గ్లామరస్ పాత్ర పోషిస్తోంది రోజా. ఈ సందర్భంగా ఈమెకు సంబంధించిన కొన్ని విషయాలు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి. అందులో ముఖ్యంగా ఆమె ఆస్తులు.. రోజా అటు రాజకీయాలలో ఇటు సినిమాలలో భారీగానే ఆస్తులు సంపాదించిందనే విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఆ ఆస్తులు చిట్టా గురించి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తెలిపింది.

ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్.. మీ మెయింటైనెన్స్ కి , జువెలరీకి , చీరలకి నెలకి ఐదారులక్షలు ఖర్చు అవుతుంది కదా అంటూ ప్రశ్నించగా? .రోజా మాట్లాడుతూ.. "బంగారం బర్తడే కి మాత్రమే కొంటాను. మళ్లీ ఎప్పుడు కొనను. నెలకి రూ .5 లక్షలు వస్తే చాలు కుటుంబమంతా కూడా హ్యాపీగా ఉంటాము . నేను ఎక్కువగా భోజనాలకి ఖర్చు చేస్తాను.నా ఇంటికి ఎవరు వచ్చినా కూడా సంతృప్తిగా భోంచేసిన తర్వాతే వారు హ్యాపీగా ఇంటికి వెళ్లాలని చెప్తాను. అలా వెళ్తేనే నాకు ఆనందం. ముఖ్యంగా నా ఇంటికి వచ్చిన వారు కూడా తన సొంత ఇంటికి వచ్చామనే ఫీలింగ్ కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటాను.

అంతేకాదు నా నియోజకవర్గంలో ఉండే ప్రెగ్నెంట్ లేడీ లకు అన్ని సౌకర్యాలు చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే నేను గర్భవతిగా ఉన్నప్పుడు ఆకలి విలువ ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. ముఖ్యంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి స్కానింగ్ కి వచ్చిన వారికి కచ్చితంగా భోజనం పెట్టిస్తాను. నేను అధికారంలో ఉన్నా.. లేకపోయినా నా నియోజకవర్గంలో ఉండే హాస్పిటల్స్ లో ఇది కచ్చితంగా జరుగుతూనే ఉంటుంది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను అంటూ తెలిపింది.

అలాగే చెన్నైలో రూ. 500 నుంచి రూ .700 కోట్ల రూపాయల వరకు ఆస్తి ఉంది అనే విషయం పైన రోజా క్లారిటీ ఇస్తూ.. నా దగ్గర 3 ఇళ్ళు ఉన్నాయి.. ఒకటి చెన్నైలో ఉంది, అయితే ఆ ఇల్లు నేను పెళ్లి కాకముందే తీసుకున్నాను. హైదరాబాదులో కూడా ఒక ఇల్లు ఉంది. అది రాజకీయాలలోకి రాకముందే ఉంది. నగరిలో ఉండే ఇల్లు నేను మంత్రి కాకముందు కట్టుకున్నానని తెలిపింది రోజా. అంతేకాదు 2 కోట్ల విలువైన లగ్జరీ కార్లతో పాటు 10 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు గతంలో తెలిపింది. మొత్తానికి అయితే తన ప్రాపర్టీ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు వందల కోట్ల ఆస్తి ఉంది అనే వార్తలకు ఒక్కసారిగా చెక్ పెట్టింది ఈ ముద్దుగుమ్మ ..

Tags:    

Similar News