జగ్గారెడ్డికి బెయిల్...తప్పుతుందా జైల్

Update: 2018-09-24 14:29 GMT
మానవ అక్రమ రవాణా  కేసులో అరెస్టైన కాంగ్రస్ నాయకుడు మాజీ ఎమ్మేల్యే జగ్గారెడ్డికి బెయిలోచ్చింది. దొంగ పాస్‌ పోర్టులతో - తన భార్య పిల్లల పేర్లతో కొందరిని అమెరికా పంపిన కేసులో జగ్గారెడ్డిని తెరాస ప్రభుత్వం అర్దరాత్రి హడావుడిగా అరెస్టు చేసింది. ఈ కేసులో జగ్గారెడ్డి గడచిని పది పదిహేను రోజులుగా జైలులోనే ఉన్నారు. ఆయనను అరెస్టు చేసిన అనంతరం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హడావుడి చేసారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆరోపించారు.  అయితే  ఆ తర్వాత మాత్రం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేదు. జగ్గారెడ్డిని అరెస్టు చేసిన పోలిసులు వ్యక్తిగత కస్టడీకి తీసుకున్నారు. రెండురోజుల పాటు ఆయన్ని విచారించారు. పదిరోజుల హైడ్రామా తర్వాత జగ్గారెడ్డికి బెయిల్ దొరికింది.  దీంతో సోమవారం నాడు జగ్గారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. మానవ అక్రమ రవాణ కేసులో జగ్గారెడ్డి అరెస్టు కావడంతో కాంగ్రెస్ పార్టీ దీనిపై ఉద్యమించాలని భావించింది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఎందుకో ఈ అంశంపై పెద్దగా స్పందించ లేదు.

నిజానికి ముందస్తు ఎన్నికల సమయంలో జరిగిన ఈ అరెస్టుపై తెలంగాణ రాష్ట్ర సమితీని - ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ నాయకులు భావించారు. అయితే దీనికి విరుద్దంగా జగ్గారెడ్డి అరెస్టు అయిన రోజు తప్పా - ఆ  తర్వాత  రోజు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇది పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసింది. జగ్గారెడ్డి అరెస్టును అడ్డం పెట్టుకుని పొలిటికల్ మైలేజ్ తెచ్చుకోవాలన్న కాంగ్రెస్ కార్యకర్తల ఆలోచనకు ఆ పార్టీ నాయకులు ఎందుకో అడ్డుకట్ట వేసారు. దీంతో జగ్గారెడ్డి కేసు అంశం మరుగున పడింది. ఇప్పుడు జగ్గారెడ్డి బెయిల్ పై విడుదల అవ్వడంతో ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఈ విషయం రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందోనని రాజకీయ పరిశీలకులు అంచన వేస్తున్నారు.


Tags:    

Similar News