శత్రుశేషం లేకుండా చేస్తున్న జగన్‌

Update: 2019-03-19 01:30 GMT
పదేళ్లపాటు ప్రతిపక్ష నాయకుడి హోదా - దాదాపు ఏడాదిన్నర పాదయాత్ర.. జగన్‌ ని సంపూర్ణమైన రాజకీయ నాయకుడిగా మార్చేసింది. ఒకప్పుడు ఉన్నంత అవేశం ఇప్పుడు లేదు. ఆవేశానికి ఇప్పుడు ఆలోచన తోడైంది. అందుకే..ఏది మాట్లాడినా చాలా నిదానంగా - నవ్వుతూ సమాధానం చెప్పడం నేర్చుకున్నారు. అన్నింటికి మించి రాజకీయాల్లో అందర్ని కలుపుకుని పోవాలి అనే సూక్తిని బాగా వంటబట్టించుకున్నారు జగన్‌.
         
2014లో జగన్ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఎవ్వర్ని కేర్‌ చేసేవాళ్లు కాదు. సీటు ఇవ్వడం కుదరదు అంటే కుదరదని చెప్పేవాళ్లు. దీంతో సీట్లు రానివాళ్లంతా టీడీపీలో చేరారు. దీంతో టీడీపీ బలపడింది. విజయం సాధించింది. కానీ ఇప్పుడు జగన్‌ మారాడు. ఎంతమంది వచ్చినా పార్టీలో చేర్చుకుంటున్నాడు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే - ఎంపీ పదవులు ఇవ్వకపోయినా  వారిని వదులుకోవడం లేదు. భవిష్యత్‌ లో న్యాయం చేస్తానంటూ చెప్తూ.. వాళ్లు మళ్లీ టీడీపీ వైపు చూడకుండా చేస్తున్నారు. రీసెంట్‌ గా వైసీపీలో చేరిన అలీ - జయసుధకు జగన్‌ ఎలాంటి పదవులు ఇవ్వలేదు. అలాగే కొణతాల రామకృష్ణ - దాడి వీరభద్రరావుకి కూడా. అయితే వారి సేవల్ని పార్టీకి ఉపయోగించుకోబోతున్నారు. దాడి వీరభద్రరావుని వైసీపీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అప్పుడు ఏదో ఒకటి కచ్చితంగా చేస్తాడనే భావనని వలస నాయకులకు కలిగిలే చేస్తున్నారు జగన్‌. మొత్తానికి అందర్ని కలుపుకునిపోతూ తనకు శత్రుశేషం అనేదే లేకుండా చేసుకుంటున్నారు.   
Tags:    

Similar News