వైఎస్ వివేకాను చంపిందెవరో జగన్ కు తెలుసు

Update: 2021-08-03 23:30 GMT
టీడీపీ నేత, ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశాడు. సీఎం జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై మరో బాంబు పేల్చారు. వైఎస్ వివేకాను దారుణంగా చంపింది ఎవరో ముఖ్యమంత్రి జగన్ కు ఖచ్చితంగా తెలుసు అని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు.

పులివెందులలోని ఆర్అండ్ బీ గెస్ట్ హౌస్ లో మంగళవారం మీడియాతో మాట్లాడిన బీటెక్ రవి.. వైఎస్ వివేకా హత్య కేసు విషయమై ఘాటు ఆరోపణలు చేశారు. ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, దస్తగిరి, వీరంతా నిందితులైతే కీలక సాక్షి రంగన్న నేరుగా వైఎస్ జగన్ కు చెబితే కేసు వెంటనే అయిపోతుంది కదా అని బీటెక్ రవి ప్రశ్నించారు. ఈ మాత్రం దానికి రెండేళ్ల సమయం కావాలా? అని బీటెక్ రవి నిలదీశారు.

తన బాబాయ్ వైఎస్ వివేకా హత్య కేసులో నిందితులను తప్పించేందుకు సీఎం జగన్ ప్రణాళిక వేశారని బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే గతంలో కడప ఎస్పీ అభిషేక్ మహంతి దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారని బీటెక్ రవి గుర్తు చేశారు. ఇప్పుడు సీబీఐ ఉన్నతాధికారి సుధాసింగ్ దర్యాప్తు నుంచి తప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ రెండు అనుమానాస్పదంగా ఉన్నాయని బీటెక్ రవి ఆరోపించారు.

అసలు నిందితులను తప్పించేందుకు సీఎం ప్రణాళికబద్దంగా ముందుకెళుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ ఆరోపించారు. పులివెందులకు చెందిన సునీల్ యాదవ్ లాంటి సాధారణ వ్యక్తులు వైఎస్ కుటుంబంలోని ఒక వ్యక్తిని హత్య చేసి తిరిగే పరిస్తితి ఉందా అని బీటెక్ రవి ప్రశ్నించారు. ఎర్ర గంగిరెడ్డికి భయపడేవాళ్లు అసలు పులివెందులలోనే లేరని అన్నారు.





Tags:    

Similar News