జగన్ కు ఆ విషయంలో ఫుల్ క్లారిటీ
ప్రధాన ప్రతిపక్షనేత - వైసీపీ అధినేత వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పై స్పష్టతతో ఉన్నట్లు కనిపిస్తోంది. తెలుగుదేశం ప్రజా కంటక పాలనకు విసిగిపోయిన ప్రజలు తమకు పట్టం కట్టడం ఖాయమని మరోమారు జగన్ పునరుద్ఘాటించడమే ఇందుకు నిదర్శనం. వైఎస్ ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాలలో అన్ని గ్రామాలకు చెందిన ప్రజలు - అధికారులతో సమస్యలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రెండేళ్లలో రాష్ట్రంలో ఏర్పడేది మన ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. కాబట్టి పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ అధైర్యపడవద్దని జగన్ తెలిపారు. ఎలాంటి సమ స్యలైనా అందరం కలిసికట్టుగా పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని, ఎవరికీ అన్యాయం జరిగినా సహించేది లేదని జగన్ తేల్చిచెప్పారు.
పాలనలో - అభివృద్ధిలో - సంక్షేమ పథకాల అమలులో తెలుగుదేశం పార్టీ ఘోరంగా విఫలమైందని జగన్ మండిపడ్డారు. ప్రభుత్వం అవినీతి అక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయని, ప్రజలకు తాగేందుకు గుక్కెడు నీరు లభించడం లేదని అన్నారు. అయినా ప్రభుత్వం ఎలాంటి ప్రత్నామ్నాయ చర్యలు తీసుకోవడం లేదని జగన్ ఆరోపించారు. చీనీ - బొప్పాయి - అరటి - దానిమ్మ - నిమ్మతోటలు నీళ్లు లేక నిట్టనిలువునా ఎండుతున్నాయని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పంటలను కాపాడేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం చెప్పేదొకటి.. ఆచరణలో చేసేది మరొకటిగా మారిందని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సీ - ఎస్టీలు నివసిస్తున్న ప్రాంతాలకు సంబంధించి ఒక్కొక్క ఇంటికి 50యూనిట్ల వరకు విద్యుత్ ఉచితమని పేర్కొంటున్నా.. రూ.100 - రూ.200 - రూ.300లు ఇలా రూ.600ల వరకు బిల్లులు చెల్లించాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రత్యేక ప్యాకేజితో ఏదో సాధించానని చంద్రబాబు గర్వంగా చెప్పుకోవడం సిగ్గుచేటని జగన్ మండిపడ్డారు. ప్రత్యేక హోదాకోసం వైసీపీ రాజీలేని పోరాటం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు తాండవిస్తున్నా చంద్రబాబు పట్టించుకోరు కానీ.. ప్రాజెక్టుల కాంట్రాక్టర్ల విషయంలో మాత్రం ప్రత్యేక జీవోలు విడుదల చేసి దోచిపెడుతున్నారని జగన్ విమర్శించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/