అప్పట్లో చంద్రబాబు..ఇప్పట్లో జగన్ బాబు!

Update: 2019-11-19 14:30 GMT
మనకి దెబ్బ తగిలినప్పుడు ..ఎదుటువారిని దెబ్బ కొట్టడానికి సరైన సమయం కోసం వేచి చూడాలి తప్ప ..అప్పుడే దెబ్బ కొట్టాలి అంటే మూర్ఖత్వం అవుతోంది. ఈ విషయం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా తొందరగా అర్థం చేసుకున్నారు. దెబ్బ కొట్టారు కదా అని ఊరికే కూర్చోము .. సమయం కోసం వేచి చూస్తాం ... దెబ్బకి దెబ్బ కొట్టి తీరుతాం.. ప్రస్తుతం సీఎం .. గత ప్రభుత్వ హయాంలో నంద్యాల ఉపఎన్నికల ఫలితం తరువాత చెప్పిన మాటలు. అప్పుడు అందరూ జగన్ ఓటమి నిరాశలో ఎదో మాట్లాడారు అని అనుకున్నారు. కానీ , నేడు పరిస్థితి చూస్తుంటే  మాత్రం ఆ రోజు జగన్ చెప్పింది చేసి చూపించారు అని అనిపిస్తోంది.

గత ప్రభుత్వం హయాంలో తనను ఏ మార్గంలో అయితే టీడీపీ అవమానించిందో..అదే దారిలో వెళ్లి చంద్రబాబును ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకున్నట్లుగా కనిపిస్తోంది. కానీ , రాజకీయంలో విశ్వసనీయత ఉండాలని చెప్తున్నారు. టీడీపీ లో నుండి వైసీపీ లోకి చేరాలని చాలామంది ఉన్నప్పటికీ ..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని చెప్పడంతో ఆలోచనలో పడ్డారు. ఇంతకీ సీఎం జగన్ ఏ విషయంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకున్నారు..దెబ్బకు దెబ్బ అంటూ ఏ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు...అనే విషయాలని ఒకసారి పరిశీలిస్తే ...

2014 ఎన్నికలలో వైసీపీ తరపున జమ్మలమడుగు నుండి గెలిచిన ఆది నారాయణ రెడ్డి ..ఆ తరువాత టీడీపీలోకి జంప్ అయ్యారు. ఇక అప్పటినుండి ఆది నారాయణ రెడ్డి ముందు పెట్టిన ఏకైక లక్ష్యం జగన్. జగన్ ని విమర్శించడమే లక్ష్యం గా ఆది నారాయణ పనిచేసారు. దీనితో చంద్రబాబు క్యాబినెట్ లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఆ తరువాత మరింతగా రెచ్చిపోయాడు. ఇక, ఎన్నికల సమయంలో కడప జిల్లాలో ఆది నారాయణ రెడ్డి  ప్రభావం చూపిస్తారని టీడీపీ ఆశలు పెట్టుకుంది. కానీ, ఊహించని ఫలితాలు వచ్చాయి. మరో ముఖ్యమైన విషయంలో జగన్ మోహన్ రెడ్డి ని తన వర్గానికి చెందిన నేతలతో విమర్శలు చేయిస్తూ జగన్ ఇమేజ్ డౌన్ చేయడానికి ప్రయత్నాలు చేసారు. ఇందులో భాగంగానే చాలామందిని పార్టీలోకి లాగేసారు. కానీ , రాజీనామా చేయించకుండా పార్టీలో కి చేర్చుకోవడం .. మంత్రి పదవులు ఇవ్వడం టీడీపీ కి బిగ్ మైనస్ గా మారింది.

ఇక అప్పుడు ఏ సామజిక వర్గాన్ని అయితే అడ్డు పెట్టుకొని జగన్ కి అడ్డుకట్టవేయాలని చంద్రబాబు ప్రయత్నాలు చేసాడో ..అదే ఫార్ములాని ఉపయోగించుకొని నేడు సీఎం జగన్ కూడా చంద్రబాబు కి రివర్స్ కౌంటర్స్ ఇస్తున్నారు. అధికారంలోకి  వచ్చిన అయిదు నెలల్లోనే టీడీపీ ఎమ్మెల్యే వంశీని తమ వైపు తిప్పుకున్నారు. ఆయనను అధికారికంగా వైసీపీలో చేర్చుకోవాలంటే ముందుగా టీడీపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ తానే నిర్ణయించిన నిబంధనలను ఉల్లంఘించకుండా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేగా కొనసాగేలా వ్యూహం అమలు చేస్తున్నారు. త్వరలోనే పదవికి రాజీనామా చేసి . పార్టీలో చేరే అవకాశం కూడా ఉంది. నాడు ఆదినారాయణ రెడ్డిని చంద్రబాబు ఏ రకంగా ఉపయోగించారో..ఇప్పుడు ఒక రకంగా అదే తరహాలో జగన్ వంశీని ఎంచుకున్నారు. చంద్రబాబు సొంత సామాజిక వర్గంతో పాటుగా చంద్రబాబు కుటుంబానికి సత్సంబంధాలు ఉన్న కృష్ణా జిల్లా నుండి  వంశీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వంశీ తన వాయింపుడు మొదలుపెట్టారు. చంద్రబాబు తో పాటుగా లోకేష్ ని కూడా టార్గెట్ గా చేసుకొని ముందుకు వెళ్తున్నారు.

   

Tags:    

Similar News