ఎన్నికల వేళ.. ఓటర్లకు జగన్ పిలుపిదే..

Update: 2019-04-11 09:22 GMT
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని.. మార్పు కోసం నిర్భయంగా ఓటేయండని ప్రతిపక్ష నేత వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ఓటర్లకు పిలుపునిచ్చారు. దేవుడి దయతో ప్రజల అందరి దీవెనలతో అధికారంలోకి వస్తామనే సంపూర్ణ నమ్మకం ఉందని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ భారతితో కలిసి కడప జిల్లా పులివెందులలో ఓటు వేశారు జగన్.  ప్రజలంతా ధైర్యంగా ఓటేయాలని కోరారు.

కాగా పులివెందులలో పోలింగ్ 45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీనిపై జగన్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.  పోలింగ్ సమయాన్ని పొడిగించాల్సిందిగా మీడియా ద్వారా ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఇక ఇక్కడే నేషనల్ మీడియాతో జగన్ మాట్లాడారు. అధికారంలోకి వస్తామని.. ఎన్ని సీట్లు వస్తాయనే దానిపై స్పందించలేదు. అయితే జాతీయ స్థాయిలో వచ్చిన సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని.. సర్వేలన్నీ నిజమవుతాయని జగన్ చెప్పారు. జాతీయ మీడియా సంస్థలు చేసిన సర్వేల్లో దాదాపు 99శాతం వైసీపీ అధికారంలోకి వస్తుందని తేలిందని తెలిపారు.

ఇక ఈసీ తీరుపై జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 2014లో ఇదే టీడీపీ నాయకులు ఫిర్యాదు చేస్తే స్పందించిన ఈసీ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని జగన్ నిలదీశారు. డీజీపీ టీడీపీ చెప్పినట్టు చేస్తున్నాడని విమర్శించారు.
   

Tags:    

Similar News