కాపులకు జగన్ ఇచ్చిన గిఫ్ట్ ఇదే..

Update: 2019-07-29 07:48 GMT
అధికారంలోకి రాగానే జెట్ స్పీడ్ గా నిర్ణయాలు తీసుకుంటూ పాలనను పరుగులు పెట్టిస్తున్న జగన్.. తనతోపాటు గెలిచిన 151 మంది ఎమ్మెల్యేలకు కూడా పదవుల పందేరం చేస్తూ అందరినీ సంతృప్తి పరిచే పనిలో పడ్డారు. ఇక పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పదవుల పంపకాన్ని ఇప్పటికే చేపట్టారు.

గడిచిన ఎన్నికల్లో తన వెంట నడిచిన కాపులకు జగన్ గిఫ్ట్ ఇచ్చారు. తాజాగా తూర్పు గోదావరి జిల్లా రాజనగరం ఎమ్మెల్యే  - కాపు సామాజికవర్గానికి చెందిన జక్కంపూడి రాజాను కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో రాజా రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

జక్కంపూడి రాజా కాపు కోటాలో మంత్రి పదవి దక్కుతుందని వైసీపీలో మొదటి నుంచి ప్రచారం జరిగింది. అయితే సామాజిక సమీకరణాల నేపథ్యంలో కేబినెట్ పదవి ఆయనకు దక్కలేదు. ఈ నేపథ్యంలో జగన్ కు కాపు కార్పొరేషన్ పదవిని ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు.

జక్కంపూడి రాజా తండ్రి రామ్మోహన్.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అందుకే జగన్ ఏరికోరి రాజాకు ఈ పదవి కట్టబెట్టారు. ఇక కాపు చైర్మన్ కోసం చాలా మంది కాపు ఎమ్మెల్యేలు - మాజీలు పోటీపడ్డా  రాజాకే జగన్ పదవిని ఇవ్వడం విశేషం.

ఇటీవల ఎన్నికల్లో జగన్ కాపులకు 10వేల కోట్లు ఐదేళ్లలో కేటాయిస్తామని.. వారి రిజర్వేషన్లపై పోరాడుతామని హామీ ఇచ్చారు. ఆ నేపథ్యంలో కాపు కార్పొరేషన్ కు ఈ బడ్జెట్లో 2వేల కోట్లు కేటాయించారు. ఇప్పుడు చైర్మన్ పదవిని భర్తీ చేయడం గమనార్హం.


Tags:    

Similar News