కరోనా వ్యాక్సిన్ లో మరో ముందడుగు .. ఇజ్రాయెల్ కీలక ప్రకటన !

Update: 2020-05-07 07:10 GMT
కరోనా మహమ్మారి...కంటికి కనిపించని మహమ్మారితో గత కొన్ని రోజులుగా ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది. అయితే, కరోనా భాదితుల సంఖ్య భారీగా పెరిగిపోవడానికి కారణం కరోనా వ్యాక్సిన్ లేకపోవడమే. అయితే , క‌రోనా విరుగుడు మందును క‌నుగొన్న‌ట్టుగా మొద‌ట ప్ర‌క‌టించిన దేశం ఇజ్రాయెల్.  మార్చి నెల రెండో వారంలోనే ఇజ్రాయెల్ ఈ ప్ర‌క‌ట‌న చేసింది. అయితే ఆ మందు ఎంత వ‌ర‌కూ విజ‌య‌వంతం అవుతుంద‌నేది మాత్రం అప్ప‌టికి ఇంకా ప్ర‌శ్నార్థ‌కమే. దాన్ని క‌రోనా సోకిన మ‌నుషుల మీద ప్ర‌యోగించి, వారు ఆ వైర‌స్ నుంచి విముక్తి పొంద‌డ‌మే కాకుండా, ఆ పై సైడ్ ఎఫెక్ట్స్ లేవ‌ని ప‌క్కాగా నిర్ధార‌ణ అయిన‌ప్పుడే ఆ టీకా ఏదైనా కానీ విజ‌య‌వంతం అయిన‌ట్టు. లేకపోతే ఫెయిల్ అయినట్టే.

ఇప్పటికే పలు దేశాలు కరోనా కి వ్యాక్సిన్ ను కనుగొన్నాం అని ప్రకటించాయి. మ‌నుషుల మీద కొత్త వ్యాక్సిన్ ల‌ను, టీకాల‌ను ప్ర‌యోగించ‌డానికి ముందు ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు జ‌రుగుతాయి. అయితే , ఇప్పటివరకు ఏ దేశం కూడా ట్ర‌య‌ల్స్ లో విజ‌య‌వంతం అయిన‌ట్టుగా ఇంకా ఎవ‌రూ ప్ర‌క‌టించ‌లేదు. అయితే ఇజ్రాయెల్ మాత్రం ఈ విష‌యంలో మ‌రో అడుగు ముందుకు వేసింది. క‌రోనా విరుగుడు మందును క‌నుగొన్న‌ట్టుగా నెల‌న్న‌ర కింద‌టే ప్ర‌క‌టించిన ఈ దేశం ఇప్పుడు తాము బ్రేక్ త్రూ సాధించేసిన‌ట్టుగా ప్ర‌క‌టించింది. స్వ‌యంగా ఇజ్రాయెల్ మంత్రి ఒక‌రు ఈ ప్ర‌క‌ట‌న చేశారు.  ఇజ్రాయెల్ ఇనిస్టిట్యూట్ ఫ‌ర్ బ‌యోలాజిక‌ల్ రీసెర్చ్ ఈ విష‌యంలో కీల‌క ప్ర‌గ‌తి సాధించిన‌ట్టుగా ఆయ‌న తెలిపారు.

ఇప్ప‌టి వ‌ర‌కూ వైద్య‌ప‌రిశోధ‌కులు చెబుతున్న దాని ప్ర‌కారం.. క‌రోనా సోకిన వ్య‌క్తుల్లో... వ్యాధినిరోధ‌క‌త బాగా ఉంటే, ఆటోమ్యాటిక్ గా యాంటీబాడీస్ ఉత్ప‌త్తి అవుతాయి. శ‌రీరంలోకి ప్ర‌వేశించిన క‌రోనా వైర‌స్ ను నిర్మూలించేందుకు యాంటీబాడీస్ ఉత్ప‌త్తి అవుతాయి. ఆ యాంటీ బాడీస్ విజ‌యం సాధించాయంటే, శ‌రీరంలో క‌రోనా వైర‌స్ నిర్మూల‌న అవుతుంది. ఇప్పుడు చేస్తున్న క‌రోనా టెస్టుల్లో కూడా యాంటీబాడీస్ ను గుర్తించ‌డం ద్వారానే చేస్తున్నారు. క‌రోనా సోకింద‌న్న అనుమానాలున్న వ్య‌క్తుల ర‌క్తాన్ని ప‌రీక్షించి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష చేస్తూ ఉన్నారు. ర‌క్తంలో గ‌నుక యాంటీ బాడీస్ ఉంటే, క‌రోనా సోకింద‌ని నిర్ధారిస్తూ ఉన్నారు. దీనిపై ఇజ్రాయెల్ మంత్రి మాట్లాడుతూ .. క‌రోనా నివార‌ణ‌కు సంబంధించిన ప్రొటీన్  ను డెవ‌లప్ చేసిన‌ట్టుగా వారు చెబుతున్నారు. అయితే ఇందులో ఒక ప్ర‌ధాన సందేహం ఇంకా మిగిలే ఉంద‌ని అంత‌ర్జాతీయ మీడియా సంస్థ‌లు చెబుతున్నాయి. అయితే ,  హ్యూమ‌న్ ట్ర‌య‌ల్స్ జ‌రిగాయా లేదా అనేది ఆ దేశం అధికారికంగా ప్ర‌క‌టించ‌డం లేదు. అయితే క్లినిక‌ల్ ట్ర‌యల్స్ పూర్త‌యిన‌ట్టుగా పీటీఐ తెలిపింది.
Tags:    

Similar News