పొలిటిక‌ల్ డిబేట్‌: కేసీఆర్ బ‌హిరంగ స‌భ‌కు క‌వితకు లింకుందా?

క‌విత పార్టీ ప్రాథ‌మికంగా ఓటు బ్యాంకును తెచ్చుకోవాలంటే.. అది బీఆర్ ఎస్ నుంచే రావాలి. అదేస‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను కూడా.. ఆ పార్టీ నుంచే పోగేసుకోవాలి.;

Update: 2026-04-22 03:04 GMT

రాజ‌కీయాల్లో ఏం జ‌రిగినా.. ఒక‌దానికి మ‌రోదానికి మ‌ధ్య కార్యాకార‌ణ సంబంధం ఉంటుంద‌ని అంటారు. తాజాగా జ‌గిత్యాల‌లో కేసీఆర్ స‌భ‌ను నిర్వ‌హించ‌డం.. ఈ నెల 25న ఆయ‌న కుమార్తె, మాజీ ఎంపీ క‌విత పార్టీని ప్రారంభించ‌నుండ‌డం.. ఈ రెండు అంశాల‌కు సంబంధం ఉందా? అంటే.. ఉంద‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. క‌విత పార్టీ ప్రాథ‌మికంగా ఓటు బ్యాంకును తెచ్చుకోవాలంటే.. అది బీఆర్ ఎస్ నుంచే రావాలి. అదేస‌మ‌యంలో కార్య‌క‌ర్త‌ల‌ను కూడా.. ఆ పార్టీ నుంచే పోగేసుకోవాలి.

ఈ రెండే ఏ పార్టీకైనా కీల‌కం. కార్య‌క‌ర్త‌లు-ఓటు బ్యాంకు లేని పార్టీని ఊహించ‌లేం. ఈ క్ర‌మంలోనే క‌విత‌.. తొలినాళ్ల‌లో ఒకింత త‌డ‌బ‌డినా.. త‌ర్వాత త‌ర్వాత‌.. పుంజుకుని.. త‌న గురిని బీఆర్ ఎస్‌వైపే మ‌ళ్లించారు. అప్ప‌టి వ‌ర‌కు త‌నకు కేసీఆర్ దేవుడ‌ని వ్యాఖ్యానించిన ఆమె.. ఆ త‌ర్వాత ``ఫామ్ హౌస్ పాలిటిక్స్`` అని వ్యాఖ్యానించ‌డం ద్వారా బీఆర్ ఎస్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఇక‌, టీఆర్ఎస్ పార్టీ ఖాళీగా ఉంద‌ని.. దీనిని ఎవ‌రైనా తీసుకోవ‌చ్చ‌ని చెప్ప‌డం ద్వారా.. కేసీఆర్‌కు అత్యంత సెంటిమెంటు అయిన‌.. టీఆర్ ఎస్‌పై క‌న్నేశార‌న్న‌ది సుస్ప‌ష్టం.

ఈ ప‌రిణామాలు మ‌రింత ముదురుతున్నాయి. బీఆర్ ఎస్‌కు బ‌ల‌మైన కంచుకోట‌లను క‌విత టార్గెట్ చేసు కుంటున్నారు. ఈ ప‌రిణామాల క్ర‌మానికి తోడు.. ఈ నెల 25న కొత్త‌పార్టీని ప్ర‌క‌టించేందుకుక‌విత రెడీ అయ్యారు. ఇక‌... అప్ప‌టి నుంచి ఆమె ప‌య‌నం విభిన్నంగా మార‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు సాగిన ప్ర‌యా ణం.. పార్టీని ప్ర‌క‌టించిన త‌ర్వాత‌.. సాగే ప్ర‌యాణం వేగంగా పుంజుకుంటుంద‌న‌డంలో సందేహం లేదు. ఇది.. ప‌రోక్షంగా ప్ర‌త్య‌క్షంగా ప్ర‌త్య‌క్షంగా కూడా.. బీఆర్ ఎస్‌కు ఇబ్బందిక‌ర ప‌రిణామం.

ఈ నేప‌థ్యంలోనే స‌మ‌యం చూసుకుని బ‌య‌ట‌కు వ‌చ్చేలా కేసీఆర్ వ్య‌వ‌హరించార‌న్న చ‌ర్చ రాజ‌కీయ వ‌ర్గాల్లో సాగుతోంది. మాజీ ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి పార్టీలోచేర‌డం ఒక కార‌ణ‌మైతే.. మ‌రోవైపు.. సుదీర్ఘ‌కాలంగా ఫామ్ హౌస్‌కే ప‌రిమితం కావ‌డం.. వంటివి చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. ఇంకోవైపు.. క‌విత‌దూకుడు కూడా పెరి గింది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌.. బ‌య‌టకురాక త‌ప్ప‌లేద‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. క‌విత పార్టీ ప్ర‌భావాన్ని తొలినాళ్ల‌లో త‌క్కువ‌గా అంచ‌నా వేసినా.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో ఆమె వ్య‌వ‌హారం దూకుడుగా ఉంద‌ని తెలిసిన కేసీఆర్‌.. బ‌హిరంగ స‌భ ద్వారా.. మ‌రోసారి త‌న స‌త్తాను చాటుకునే ప్ర‌య‌త్నం చేశార‌ని అంటున్నారు. ఏదేమైనా.. కేసీఆర్ బ‌హిరంగ స‌భపై అనేక చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

Tags:    

Similar News