భారత దౌత్యవేత్త కారును వెంబడించిన పాక్ ఐఎస్ఐ.. వీడియో వైరల్ !
కుక్కతోక వంకర అన్నది ఎంత నిజమో ..పాక్ కి ఇక జన్మలో బుద్ధిరాదు అన్నది కూడా అంతే నిజం. తాజాగా మరోసారి పాక్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. ఏకంగా ఆ దేశంలో ఉన్న భారత దౌత్యవేత్తను భయపెట్టాలని ప్రయత్నించింది. దీని కోసం ఐఎస్ ఐ కి చెందిన ఓ వక్తిని రంగంలోకి దింపింది.ఐఎస్ ఐ కి చెందిన వ్యక్తి, భారత దౌత్యవేత్త గౌరవ్ అహ్లువాలియా నివాసం వెలుపల వేచి ఉండిఎం, అయన బయటకు రాగానే అతడి కారును వెంబడిస్తూ.. బెదిరించే ప్రయత్నం చేశాడు.
దీనికి సంబంధించిన వీడియోను దౌత్యకార్యాలయం విడుదల చేయడంతో అది వైరల్ అయ్యింది. దీంతో పాక్ తీరుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు భారత నెటిజన్లు. ఇస్లామాబాద్ లో గౌరవ్ నివాసం బయట ఓ వ్యక్తి చాలా సేపటి నుంచి వేచి ఉన్నాడు. ఆయన కారులో బయటకు రాగానే వెంటనే అతడు బైక్‌పై వెంబడించాడు. కాగా ఇటీవల గూఢచర్యానికి పాల్పడుతున్నారంటూ ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ లో పనిచేస్తున్న ఇద్దరు అధికారులను భారత్ బహిష్కరించింది.
గూఢచర్యం చేస్తూ ఇద్దరు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. అనంతరం వారిని దేశం నుంచి బహిష్కరించారు. దీంతో భారత్ పై దాయాది దేశం ప్రతికార చర్యలకు సిద్ధమైంది. దీంట్లో భాగంగానే బెదిరింపులకు దిగుతోంది. భారత అధికారులను కూడా అక్కడి నుంచి బహిష్కరించే అవకాశం ఉందని స్థానిక మీడియా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది.