న్యాయవ్యవస్ధ పై యనమల ఒత్తిడి తెస్తున్నారా ?

Update: 2020-11-23 08:00 GMT
చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. ఎలాగైనా న్యాయవ్యవస్ధపై ఒత్తిడి తెచ్చి జగన్మోహన్ రెడ్డైపై చర్యలు తీసుకునేట్లు చేయాలన్నదే టీడీపీ ప్లాన్ గా కనబడుతోంది. సుప్రింకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ, హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరితో పాటు మరో ఆరుగురు న్యాయమూర్తులపై జగన్ ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.  సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ ఏఎస్ బాబ్డే కి జగన్ లేఖ ద్వారా ఫిర్యాదు చేసిన జగన్ తన ఫిర్యాదులకు ఆదారాలను కూడా అందించారు. ఆ తర్వాత నాలుగు రోజులకు జగన్ చేసిన ఫిర్యాదును ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం మీడియా సమావేశంలో బయటపెట్టారు.

ఎప్పుడైతే ఫిర్యాదు బయటపెట్టారో అప్పటి నుండి గోల పెరిగిపోయింది. విచిత్రమేమిటంటే ఫిర్యాదులోని అంశాలను పక్కనపెట్టేసి అందరు జగన్ ఫిర్యాదు చేయటాన్ని, చేసిన ఫిర్యాదును మీడియా సమావేశంలో బయటపెట్టడాన్నే ప్రస్తావిస్తున్నారు. ఇదే విషయమై ఓ వ్యూహ ప్రకారం తెలుగుదేశంపార్టీ నేతలు పదే పదే ప్రస్తావిస్తున్నారు.  జగన్ బెయిల్ ను రద్దు చేయాలంటు తాజాగా యనమల డిమాండ్ చేయటం విచిత్రంగా ఉంది. లేఖ రాయటమే జగన్ చేసిన తప్పని, రాసిన లేఖను మీడియాకు అందించటం కోర్టు ఉల్లంఘనకే వస్తుందని యనమల పదే పదే న్యాయవ్యవస్ధను డిమాండ్ చేస్తున్నారు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే లేఖ రాసిన జగన్ బాగానే ఉన్నారు, అందుకున్న ఏఎ బాబ్డే బాగానే ఉన్నారు. మధ్యలో యనమల లాంటి వాళ్ళకు సమస్య ఏమిటో అర్ధం కావటం లేదు. జగన్ రాసిన లేఖపై అధికారికంగా బాబ్డే ఇంతవరకు స్పందించలేదు. జగన్ పై కోర్టు ధిక్కారణ కేసు నమోదు చేయాలా వద్దా ? బెయిల్ రద్దు చేయాలా వద్దా ? అన్నది న్యాయస్ధానం చూసుకుంటుంది మధ్యలో యనమలకు ఏమిటి సమస్య ? జగన్ బెయిల్ రద్దు చేయాలని చాలా కాలంగా యనమల పదే పదే ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ? జగన్ పై ఎటువంటి చర్యలు తీసుకోవాలో ఏఎస్ బాబ్డేకి తెలీదా ?

బెయిల్ రద్దు చేయాలని ఇన్నిసార్లు డిమాండ్ చేయటం కూడా న్యాయవ్యవస్ధపై ఒత్తిడి తేవటం కాదా ?  అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జగన్ లేఖ రాయటానికి, బెయిల్ రద్దు చేయటానికి ఏమన్నా సంబంధం ఉందా ? లాయర్ గా ప్రాక్టీసు చేసిన యనమలకు ఈ విషయం తెలియదా ? ఎంతసేపు బెయిల్ రద్దు అవ్వాలి, మళ్ళీ జగన్ను జైలుకు పంపాలన్న ఆలోచనే యనమల డిమాండ్ లో కనబడుతోంది. న్యాయవ్యవస్ధపై జగన్ ఒత్తిడి పెడుతున్నారన్న యనమల ఆరోపణలే నిజమైతే జగన్ బెయిల్ రద్దు చేయాలని రిపీటెడ్ గా డిమాండ్ చేయటం ద్వారా యనమల కూడా ఒత్తిడి తెస్తున్నట్లే అనుకవాలి.

బెయిల్ ఇవ్వటం, రద్దు చేయటం కోర్టుకు, జగన్ కు మధ్య వ్యవహారమన్న విషయం యనమలకు తెలీదా ? పైగా సుప్రింకోర్టు చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో ఎక్కడ కూడా జగన్ కాన్ఫిడెన్షియల్ అని చెప్పలేదు కాబట్టి బయటపెట్టడంలో తప్పే లేదని ఢిల్లీ హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ఎంఏ షా స్పష్టంగా చెప్పారు. పైగా లేఖ రాసిన వ్యక్తే దాన్ని మీడియాకు విడుదల చేశారు కాబట్టి కోర్టు ధిక్కారం కిందకు రాదని కూడా షా అభిప్రాయపడ్డారు. లేఖ రాసేముందు, మీడియాకు విడుదల చేసేముందు న్యాయ నిపుణుల సలహాలు తీసుకోకుండానే ఉంటారా జగన్. ఇంత మాత్ర ఆలోచించకుండానే పదే పదే జగన్ బెయిల్ రద్దు  విషయాన్ని డిమాండ్ చేయటమంటే కోర్టులను ఒత్తిడి చేయటం క్రిందకే వస్తుందని మరచిపోయినట్లున్నారు.
Tags:    

Similar News