బ్రదర్ అనిల్ కుమార్ పోస్టుకు అర్థం ఇదేనంటారా?
అనూహ్య పరిణామాలు రాజకీయాల్లో ఎప్పుడూ సాధ్యమే. తాజాగా అలాంటిదే రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకోనుంది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముద్దుల కుమార్తె షర్మిల కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయనున్నట్లుగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే జరిగినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు.. తాజాగా జిగిత్యాల..నిజామాబాద్ జిల్లా నేతలకు లోటస్ పాండ్ లోని తమ ఇంటికి రావాలన్న ఆహ్వానాలు అందినట్లుగా చెబుతున్నారు.
తెలంగాణలో ఏ విధంగా ముందుకు వెళ్లాలి? అందుకు ఏం చేయాలి? లాంటి ప్రశ్నలకు సమాచార సేకరణ చేయనున్నట్లు చెబుతున్నారు. అయితే.. మంగళవారం ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశాల్లో తన అభిప్రాయాన్ని వెల్లడించేందుకు షర్మిల ప్రాధాన్యం ఇస్తారా? లేక.. పలువురు అభిప్రాయాల్ని తీసుకునేందుకు పెద్ద పీట వేస్తారా? అన్నది అసలు ప్రశ్న. అయితే.. దీనిపై ఒక్కొక్కరు ఒక్కోలాంటి సమాధానం ఇస్తున్నారు.
ఇదిలా ఉంటే.. షర్మిల కొత్త పార్టీ వార్తల వేళ.. మరోఆసక్తికర అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ తన ఫేస్ బుక్ పేజీలో ఇటీవల పెట్టిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. ‘అదే చోట.. అదే పార్టీలో ఉండకుండా సొంత ప్రయత్నం చేస్తాను’ అంటూ ఇంగ్లిషులో ఉన్న పోస్టుకు అసలుసిసలు అర్థం తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ అంశాలే అన్న మాట వినిపిస్తోంది. షర్మిల కొత్త రాజకీయ పార్టీపై ఉన్న ఫజిల్ ఒక కొలిక్కి రావాలంటే.. కాస్త టైం తీసుకుంటే సరిపోతుందన్న మాట వినిపిస్తోంది.