నిమ్మగడ్డ హిడెన్ అజెండా ఇదేనా ?

Update: 2020-11-19 04:30 GMT
స్టేట్ ఎలక్షన్ కమీషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహార శైలి చాలా విచిత్రంగా ఉంటోంది.  వాయిదాపడిన స్ధానిక సంస్ధల ప్రొసీడింగ్స్ ను విడుదల చేసిన నిమ్మగడ్డ వచ్చే ఫిబ్రవరిలో స్ధానిక సంస్ధల ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే ఎన్నికల నిర్వహణకు నాలుగు వారాల ముందు నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని స్పష్టంగా చెప్పారు. ఇక్కడే కమీషనర్ వైఖరిపై అనుమానాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాన్ని ఏదో పద్దతిలో ఇబ్బందులు పెట్టాలన్న హిడెన్ అజెండానే నిమ్మగడ్డ అమలు చేస్తున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

లేకపోతే నాలుగు వారాల పాటు ఎన్నికల కోడ్ అమలు చేస్తామని చెప్పటం ఏమిటి ? ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించటం ఖాయమైతే జనవరి నుండి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసినట్లే కదా. అంటే ఇన్ని రోజులు ప్రభుత్వ వ్యవహారాలన్నీ దాదాపు స్తబించిపోతాయనటంలో సందేహం లేదు. ఎన్నికల నిర్వహణకు నెలరోజుల ముందు, ఎన్నికల నిర్వహణ అయిపోయి ఫలితాలు వచ్చిన  తర్వాత మరికొన్ని రోజుల వరకు ప్రభుత్వ వ్యవహారాలు ఎక్కడివి అక్కడే స్తంబించిపోవటం ఖాయం.

ఎక్కడైనా ఇన్ని రోజులు అసలు ఎన్నికల కోడ్ ను అమలు చేస్తారా ? అన్నదే ఇపుడు అనుమానం మొదలైంది.  పైగా మార్చి నెలంటే ఆర్ధిక సంవత్సరం ముగుస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆర్ధిక సంవత్సరం ముగిసేముందు ప్రభుత్వం అనేక శాఖలకు కేటాయించిన నిధులను పెద్ద ఎత్తున ఖర్చులు పెట్టేయటం సహజం. స్ధానిక సంస్ధల ఎన్నికల నిర్వహణ పేరుతో జనవరి నుండే ఎన్నికల కోడ్ అమల్లోకి తెస్తే ఇక ప్రభుత్వ కార్యక్రమాలు జరిగే అవకాశం లేదు. ఎందుకంటే యావత్ ప్రభుత్వ యంత్రాంగం ఎన్నికల కమషన్ పరిధిలోనే పనిచేయాల్సుంటుంది. గతంలో ఎన్నికలను నిరవదికంగా వాయిదా వేసినట్లు ప్రకటించినపుడు కూడా కోడ్ అమల్లోనే ఉంటుందన్నారు. చివరకు సుప్రింకోర్టు గట్టిగా చెప్పిన తర్వాతే కోడ్ ను ఎత్తేశారు.

ప్రతిదానికి తెలంగాణాను ప్రస్తావిస్తున్న నిమ్మగడ్డ స్ధానిక సంస్ధల ఎన్నికల కోడ్ విషయాన్ని మాత్రం ప్రస్తావించటం లేదు. తెలంగాణా స్ధానిక సంస్ధల ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించిన ఎన్నికల కమీషనర్ పార్ధసారధి మొత్తం ఎన్నికల ప్రక్రియను 15 రోజుల్లోనే ముగించేస్తున్నారు.  ఒకవేళ ఏపిలో కూడా ఎన్నికలు నిర్వహించాల్సొస్తే ఇదే పద్దతిని నిమ్మగడ్డ ఎందుకు అనుసరించాలని అనుకోవటం లేదు ?  నిమ్మగడ్డ ఆలోచన ప్రకారం జనవరి, ఫిబ్రవరి మొత్తం ఎన్నికల కోడ్ పేరుతో ప్రభుత్వ కార్యక్రమాలను స్తింబింపచేయాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
Tags:    

Similar News