పిల్లాడు కాదు పిడుగు: తొమ్మిదేళ్లకే గేమింగ్ డిజైన్
వావ్ అనే టాలెంట్ కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. తొమ్మిదేళ్ల ఆరిత్ ఆ కోవకు చెందిన వాడు.;
వావ్ అనే టాలెంట్ కొందరిలో కనిపిస్తూ ఉంటుంది. తొమ్మిదేళ్ల ఆరిత్ ఆ కోవకు చెందిన వాడు. పిల్లాడే కానీ అపర మేధావి. మిగిలిన పిల్లల మాదిరి కాకుండా.. తమ కొడుకు టాలెంట్ వేరే లెవల్ అన్న విషయాన్ని గుర్తించిన తండ్రి.. మిగిలిన తల్లిదండ్రులకు భిన్నంగా వ్యవహరించిన షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నాడు. కొడుకును స్కూల్ మాన్పించి.. కొడుకు టాలెంట్ కు తీసిపోని విధంగా.. ప్రత్యేక కరిక్యులమ్ ను క్రియేట్ చేయటమే కాదు.. గేమింగ్ డిజైన్ మీద ఉన్న ఫ్యాషన్ ను గుర్తించి.. ఆయా అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్న వైనం తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు
మధ్యప్రదేశ్ కు చెందిన తొమ్మిదేళ్ల రితేశ్ బజాజ్.. తన తోటి పిల్లలకు భిన్నమైన టాలెంట్ ఉన్న పిల్లాడు. రితేశ్ తండ్రి టీసీఎస్ లో జాబ్ చేస్తుంటే.. తల్లి సీఏ పూర్తి చేసి కంపెనీలో పని చేస్తున్నారు. తమ కొడుకులోని టాలెంట్ ను గుర్తించిన రితేశ్ తండ్రి రితేశ్.. మూడో తరగతి చదువుతున్న కొడుకును స్కూల్ మాన్పించాడు. అంతేకాదు.. తన జాబ్ ను వదిలేశాడు. తన కొడుక్కి ఉన్న ప్రత్యేక ఆసక్తులకు అనుగుణంగా పాఠ్యాంశాల్ని రూపొందిస్తూ ఇంట్లోనే కొడుక్కి చదువు చెప్పటం మొదలుపెట్టాడు.
ఈ క్రమంలో చిన్న వయసులోనే కోడింగ్ నేర్చుకున్న ఆరిత్.. తన చెల్లి కోసం ఏకంగా ఆన్ లైన్ గేమింగ్ ను డిజైన్ చేశాడు. అమెరికన్ ఇంగ్లిషులో ప్రావీణ్యం కోసం ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తున్నారు. చదువుకు తాము వ్యతిరేకం కాదని..కాకుంటే.. తమ పిల్లాడికి ఉన్న ప్రత్యేక టాలెంట్ ను చూసి.. వాటిని పదునుపెట్టాలని డిసైడ్ అయినట్లుగా తండ్రి రితేశ్ చెబుతుంటారు. పిల్లలకు ఇష్టం లేని వాటిని వదిలేసి.. వారికి ఆసక్తి ఉన్న రంగంలో శిక్షణ ఇప్పిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు. ఆరిత్ కు గేమింగ్ లో ఆసక్తి ఉందన్న విషయాన్ని తెలుసుకోవటమే కాదు.. కోడింగ్ నేర్పించటం..ఆ రంగంలోని నిపుణులను పరిచయం చేసినట్లుగా చెప్పారు. ఈ కారణాలతోనే తొమ్మిదేళ్ల వయసులోనే తన కొడుకు సొంతంగా ఒక గేమ్ ను డిజైన్ చేసినట్లు చెబుతారు. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించటం అంటే ఏమిటో ఈ తండ్రికొడుకుల్ని చూస్తే అర్థమవుతుంది. కాదంటారా?