నెల్లూరు నడిబొడ్డున సెలూన్ పేరుతో అలాంటి గబ్బు సేవలా?
అది నెల్లూరు నగరంలోని దర్గామిట్ట ప్రాంతం. ఆ ఊరికి నడిబొడ్డున ఉండే ఈ ప్రాంతం నిత్యం విపరీతమైన రద్దీ ఉంటుంది. వ్యాపారాల జోరు ఎక్కువ. ఇలాంటి ప్రాంతంలో ప్లాటినమ్ సెలూన్ పేరుతో ఒక సెలూన్ షాపు ఉంది. ఈ షాపు మీద పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ సందర్భంగా షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నగర సెంటర్ లో ఉన్న ఈ సెలూన్ లో అసలు కంటే కూడా కొసరు పనులే ఎక్కువన్న విషయం బయటకు వచ్చింది.
పేరుకు సెలూనే కానీ అక్కడ అందించే సేవలు వేరన్న విషయాన్ని పోలీసులు గుర్తించటమే కాదు.. హైటెక్ వ్యభిచారాన్ని గుట్టురట్టు చేశారు. కోల్ కతాకు చెందిన యువతితో పాటు.. మరో విటుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగరం నడిబొడ్డున సెలూన్ పేరుతో ఇలాంటి హైటెక్ వ్యభిచారం జరగటాన్ని పలువురు జీర్ణించుకోలేకపోతున్నారు.
కోల్ కతా నుంచి యువతుల్ని తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా ఇంతకాలం గబ్బు సేవల్ని అందిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో.. ఈ అంశంపై లోతుగా విచారించిన పోలీసులకు కొత్త విషయాలు బయటకు వచ్చాయి. గడిచిన కొంతకాలంగా ఈ దందా సాగుతున్నట్లుగా గుర్తించారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. స్థానికంగా ఈ అంశం సంచలనంగా మారింది.