• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  రజిని ఐకాన్ వెనుక ఇంత...

రజిని ఐకాన్ వెనుక ఇంత పెద్ద కథ ఉందా..?

By - Tupaki Desk
Update: 2019-11-04 08:17 GMT
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఒక సాధారణ బస్సు కండక్టర్ స్థాయి నుండి నేడు ఒక రాష్ట్రాన్ని శాసించే స్థాయికి ఎదిగారు. అలాగే రజినీకి ఇండియా తో పాటుగా ప్రపంచ దేశాలలో అభిమానులు , అభిమాన సంఘాలు ఉన్నాయి. రజిని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విడుదలైతే ఉండే ఆ హడావిడే వేరు. సినిమా హిట్ , ప్లాప్ అన్న తేడా లేకుండా కలెక్షన్స్ ని కుమ్మేస్తాడు. ఎంత ఎదిగిన ఒదిగి ఉంటడం నేర్చుకోవాలి అనే మాటలు రజిని ని చూసే ఎవరైనా చెప్పారా అనుకునేలా చాలా సాధారణమైన జీవితాన్ని గడుపుతారు.

ఇకపోతే  గత కొన్ని రోజులుగా  రజిని పార్టీ పెట్టి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారు అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల ముందే పార్టీ పెట్టాలని అనుకున్నారు. కానీ , ఆ తరువాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ , రజిని వచ్చే ఎన్నికలలోపు రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం అనే వార్తలు వినిపిస్తుండం తో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమిళనాడు లో పట్టు చూపించడానికి అప్పుడే పావులు కదుపుతోందా అని అనిపించకమానదు. ఎందుకు అంటే ఈ మద్యే రజినీకి కేంద్రం ఐకాన్‌ సిల్వర్‌ జూబ్లీ పురస్కారం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీనిపై సినీ వర్గాలలో ఆనందం కలుగుతున్న .. రాజకీయ వర్గాలలో మాత్రం సరికొత్త చర్చ నడుస్తుంది.

ఎలాగైనా రజనీని బీజేపీలో చేర్చుకోవాలన్న ఉద్దేశంతోనే ఆయనను మెప్పించే విధంగా కేంద్రప్రభుత్వం ఈ అవార్డును ప్రకటించిందని రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాలలో రాణించగలుగుతున్న బీజేపీ తమిళనాట కాలుమోపలేని పరిస్థితి ఉంది. ఆ తరుణం కోసం ఎదురుచూస్తున్న బీజేపీ.. ఇప్పుడు రజనీకాంత్‌ మద్దతుతో తమిళనాడు లో కాలుమోపాలని చూస్తుంది. దీనితో ఐకాన్  రాజకీయం మొదలు పెట్టింది అంటూ మాట్లాడుకుంటున్నారు.  బీజేపీ నిర్ణయాలకు రజనీ ఏకీభవిస్తుండడంతో కాషాయ పార్టీలో రజనీ చేరికపై ఊహాగానాలు మొదలయ్యాయి.

రాజకీయాల్లో నా దారి రహదారేనని చెబుతున్న రజనీని పార్టీలో చేర్చుకోకపోయినా, తమ పార్టీ ఏర్పాటు చేయబోతున్న  కూటమిలోనైనా చేర్చుకోవాలని బీజేపీ పెద్దలు ప్లాన్ వేస్తున్నారంట. దీనికోసమే  ఆయనకు కేంద్రప్రభుత్వం ఐకాన్‌ సిల్వర్‌ జూబ్లీ పురస్కారాన్ని ప్రకటించిందని, అయితే ఇది ఎంతవరకు ఫలిస్తుందో వేచి చూడాల్సివుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం రజిని దర్బార్‌ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంక్రాంతికి అభిమానుల ముందుకు రానున్నది.
Tags:    
  • Thalaiva 
  • Super Star Rajinikanth 
  • Chennai 
  • Tamilnadu 
  • Tamil Politics 
  • Super Star Rajini 
  • Tupaki Updates 
  • Tupaki News 
  • Tupaki Political Updates 

Similar News

టీడీపీకి జనసేన ఝలక్...సిక్కోలులో బిగ్ ట్విస్ట్ !

2026-11-20 18:01 GMT

చిన్న శ్రీను పంతం నెగ్గింది...జిల్లాలో కొత్త రాజకీయం

2026-11-20 17:40 GMT

ధరలకు కూటమి కత్తెర...పేదలకు ఊరట !

2026-11-20 17:40 GMT

నిన్న పవన్...నేడు షర్మిల...జగన్ స్ట్రాంగ్ డెసిషన్

2026-11-20 17:40 GMT

నడిచే బంగారు దుకాణంలా 'గోల్డ్ మ్యాన్'.. రూ.7 కోట్ల ఆభరణాలతో వైరల్

2026-11-20 17:37 GMT

యాడ్స్ లేవు.. టీఆర్పీ లేదు.. తెలుగు న్యూస్ ఛానళ్లు రన్ ఎలా ?

2026-11-20 17:36 GMT

ముగిసిపోతుందనుకున్న బంధానికి కొత్త ఊపిరి.. ఒక్క కౌగిలింతతో కరిగిన మనసు

2026-11-20 17:32 GMT

సీఎంగా లోకేష్.... చంద్రబాబు పాత్ర ఏంటి....రాజకీయ సమీకరణాలు ఎన్నో !

2026-11-20 17:30 GMT

సహజీవనంలో పుట్టిన బిడ్డ.. ఎవరికి హక్కు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

2026-11-20 17:28 GMT

మంత్రిగారు.. స్పీక‌ర్‌గారూ.. టీడీపీలో ఇంట్ర‌స్టింగ్ డిబేట్‌.. !

2026-11-20 17:27 GMT

కొత్త బండికి మూడేళ్ల స్వేచ్ఛ.. పాత బండికి ఆరు నెలలకో అగ్నిపరీక్ష

2026-11-20 17:26 GMT

వైఎస్ భారతీరెడ్డికి వైసీపీ కీలక బాధ్యతలు.. ఇప్పటికే రంగంలోకి దిగిన మేడం!

2026-11-20 17:25 GMT

Copyright @2026

Powered by Blink CMS