ఆ తమ్ముళ్లు.. మాట్లాడలేరు.. అలా అని మౌనంగా ఉండలేకపోతున్నారట

Update: 2020-12-04 05:27 GMT
ఏపీ తెలుగు తమ్ముళ్ల పరిస్థితి విచిత్రంగా మారింది. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తాము తీసుకున్న నిర్ణయంతో వారు మింగా లేక కక్కాలేని సిత్రమైన పరిస్థితి. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి గెలిచిన తమ్ముళ్లు నలుగురు.. ఇప్పుడు ఆ పార్టీని కాదని.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. అలా అని తమ పదవులకు రాజీనామా చేశారా? అంటే అదీ లేదు. సొంత పార్టీ మీద గుర్రుగా ఉన్న వారు.. అధికారపక్షం చెంతకు చేరారు. అయితే.. అది కూడా అనధికారికంగా.

అలాంటివారిలో చీరాల ఎమ్మెల్యే కరణం బలరామ‌ కృష్ణ‌మూర్తి.. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. విశాఖ సిటీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్.. గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గిరిధర్ లు ఉన్నారు. వీరిప్పుడు అసెంబ్లీలో మాట్లాడటానికి తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఎందుకంటే.. ఈ నేతలు  అసెంబ్లీలో మాట్లాడాలంటే స్పీకర్ ను అడగాలి. ఏ పార్టీ తరఫున అన్న విషయాన్ని చెప్పలేరు.

అధికార పార్టీ అని చెబితే..అనర్హత వేటు పడుతుంది. అలా అని తాము గెలిచిన పార్టీ పేరును చెప్పలేరు. పార్టీని విడిచి పెట్టేసిన తర్వాత.. కూడా ఆ పార్టీ పేరు చెబితే పరువు పోతుంది. అందుకే.. మింగాలేక.. కక్కా లేక ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. స్థానిక సమస్యల్ని చట్ట సభల్లో ప్రస్తావించి.. వాటి పరిష్కారం కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. అయితే.. అలాంటి పరిస్థితి లేకపోవటంతో తమ బాధను ఎవరికి చెప్పలేక.. కిందామీదా పడిపోతున్నట్లుగా చెబుతున్నారు.
Tags:    

Similar News