అమరావతి ఉద్యమానికి మీడియానే అన్యాయం చేస్తోందా ?

Update: 2020-12-20 17:30 GMT
అమరావతి ఉద్యమానికి 365 రోజులు పూర్తియన తర్వాత ఓ విషయం స్పష్టంగా అర్ధహైపోయింది. అదేమంటే ఉద్యమాన్ని ఇంతకాలం కేవలం చంద్రబాబునాయుడుకు అనుకూలంగా ఉన్న మీడియా మాత్రమే నడుపుతోందని. మీడియా మద్దతు గనుక లేకపోతే ఈ ఉద్యమం ఎప్పుడో అటకెక్కిపోయుండేదనటంలో సందేహం లేదు. ఏడాదిగా ఉద్యమం జరుగుతోందని వీళ్ళు చెప్పుకోవటమే తప్ప రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాల్లో ఎవరు దీని గురించి మాట్లాడుకోవటమే లేదన్నది వాస్తవం. ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు రాయలసీమలో కానీ ఉద్యమ ప్రభావం కానీ లేదా ఉద్యమానికి మద్దతిచ్చే నేతలు కూడా లేరు.

మొన్నటికిమొన్న జరిగిన అమరావతి జనభేరిలో కూడా వేదికమీదున్న నేతలను చూస్తే ఈ విషయం స్పష్టంగ అర్ధమైపోయింది.  వేదికమీదున్న నేతలంతా చంద్రబాబు మద్దతుదారులు, గుంటూరు జిల్లా లేకపోతే రాజధానికి భూములిచ్చిన 29 గ్రామాలకు సంబంధించిన నేతలే ఎక్కువమంది కనిపించారు. నిజానికి వీళ్ళు చెప్పుకుంటున్న ఉద్యమంలో 29 గ్రమాల్లోని జనాలు కూడా పెద్దగా లేరు. మొత్తంమీద ఏ ఆరేడు గ్రామాల జనాలు మాత్రమే కాస్త యాక్టివ్ గా ఉన్నారు.

రాజధాని నిర్మాణం పేరుతో రైతుల నుండి చంద్రబాబు భూములు తీసుకున్నా ఆచరణలో ఫెయిలయ్యారు. లేనిపోని గొప్పలకు పోయి జనాలందరినీ భ్రమల్లో ముంచేసి చివరకు అదే భ్రమలో తాను కూడా ముణిగిపోయారు. ప్రపంచస్ధాయి రాజధాని అనికాకుండా వాస్తవ పరిస్దితుల ప్రకారం శాస్వతపద్దతిలోనే అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు, రాజ్ భవన్ నిర్మించేసుండాల్సింది. వేలాది ఎకరాలను సమీకరించకుండా ప్రభుత్వానికి అవసరమైన భూముల్లో మాత్రమే నిర్మాణాలు చేసేసుంటే బాగుండేంది. ఎప్పుడైతే ప్రభుత్వ నిర్మాణాలు భారీ ఎత్తున రాగానే ప్రైవేటు రంగం దానికదే డెవలప్ అయ్యుండేది.

కానీ చంద్రబాబు మాత్రం వాస్తవానికి విరుద్ధంగా కలల్లో ముణిగిపోవటమే కాకుండా తనను నమ్ముకున్న వాళ్ళను కూడా కలల్లో ఉంచేశారు. దాంతో మొన్నటి ఎన్నికల్లో హోలుసేలుగా అందరు కలిసి ముణిగిపోయారు. తన ఐదేళ్ళ ఫెయిల్యూర్ జనాలకు కనబడకుండా చంద్రబాబు మీడియాను అడ్డం పెట్టుకుని డ్రామాలాడుతున్నారు. చంద్రబాబు డ్రామాలకు మీడియా కూడా వంతపాడుతోంది. రాష్ట్రంలోని తక్కిన ప్రాంతాల్లో ఎక్కడా అమరావతి ఉద్యమం గురించి మాట్లాడుకోవటమే లేదంటే అందుకు కారణం ఎవరు ?

రాష్ట్రవ్యాప్తంగా అమరావతి ఉద్యమం సెగలు పుట్టిస్తోందని, మంగలెక్కిస్తోందని చంద్రబాబు మీడియాలో వార్తలు రాసుకుంటే ఉపయోగం లేదు. మిగిలిన ప్రాంతాల్లో కాదుకదా కనీసం అమరావతి ప్రాంతంలో కూడా లేని ఉద్యమం భీకరంగా నడుస్తోందని చంద్రబాబు మీడియా మాత్రమే చెబుతోంది. అంటే చంద్రబాబు అధికారంలో ఉన్నపుడే కాదు దిగిపోయిన తర్వాత కూడా మీడియా జనాల కళ్ళకు గంతలు కట్టాలని ప్రయత్నిస్తోంది. నిజానికి లేని ఉద్యమం బ్రహ్మండంగా సాగుతోందని ప్రొజెక్టు చేయటం వల్ల  తాను రైతులకు అన్యాయమే చేస్తోందని చంద్రబాబు మీడియా గ్రహించలేకపోతోంది. మీడియా మద్దతే లేకపోతే రైతులు ఈపాటికి ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళి ఏదో ఒకటి సాధించుకునే వారేనేమో. అవకాశం కూడా లేకుండా చేయటం వల్ల రైతులు నష్టపోతున్నారు.
Tags:    

Similar News