అయ్యా.. లోకేష్ ను మా దగ్గరికి పంపకు!

Update: 2020-12-15 14:30 GMT
‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టు.. ఇప్పుడు పాపం చంద్రబాబు ఎంత లేపుదామనుకున్నా లోకేష్ బాబు గ్రాఫ్ మాత్రం అటు పార్టీలో.. ఇటు బయట పెరగలేకపోతోందట. టీడీపీ మీడియా ఎంత బూస్ట్ ఇస్తున్నా లోకేష్ బాబు నాయకత్వ పటిమక తేలిపోతూనే ఉందట.. స్వయంగా కూడా గెలవలేని స్థితిలో లోకేష్ బాబు ఉండడంతో ఇక టీడీపీని ఏం గెలిపిస్తాడు? రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తాడన్నది కార్యకర్తల్లో తీవ్ర ఆందోళనగా ఉందట..

70 ఏళ్ల చంద్రబాబుకు వయసు మీద పడుతోంది. ఇప్పటికే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన బాబు గారు పాలిటిక్స్ లో అన్నీ చూసేశారు. టీడీపీని నడిపించాలంటే జగన్ లాగా ఉడుకు రక్తం రావాలి. చంద్రబాబు వారసుడు లోకేష్ ఏమో ఇంకా పార్టీని నెత్తిన ఎత్తుకోలేకపోతున్నారు. ఆ బరువును మోయలేకపోతున్నారు. నిరూపించుకోలేకపోతున్నారు..

చంద్రబాబు లోకేష్ ను ఫ్రంట్ లైన్ లోకి తీసుకురావాలని ఎంత ప్రయత్నిస్తున్నా.. లోకేష్ తో కావడం లేదన్నది ఇన్ సైడ్  టాక్. చంద్రబాబు అన్ని విషయాల్లో లోకేష్ ను ముందుకు నడిపిస్తుంటే టీడీపీ క్యాడర్ మాత్రం ‘‘అయ్యా.. చంద్రబాబు.. మీరు మాత్రమే పార్టీని నడిపించగలరని.. లోకేష్ వల్ల కాదని తేల్చిచెబుతున్నారట..’’ లోకేష్ వల్ల టీడీపీ బలోపేతం కాదని కుండబద్దలు కొడుతున్నారట..

ఎందుకని ప్రశ్నిస్తే.. లోకేష్ కు కనీసం సమావేశాల్లో పంచ్ డైలాగులు పేల్చడం కూడా రాదని.. రాజకీయ చతురత లేదని.. నాయకత్వ లక్షణాలు లేవని చంద్రబాబుకు తెగేసి చెప్తున్నారట..  అప్పటికప్పుడు మాట్లాడే వ్యక్తి లోకేష్ కాదని.. ఎవరో డైలాగులు రాసి ఇవ్వాలని.. ఇలాంటి వ్యక్తితో ఎలా ముందుకు వెళ్ధాం అని కార్యకర్తలు అనుకుంటున్నట్టు గ్రౌండ్ రిపోర్టులు చెప్తున్నాయట..
Tags:    

Similar News