రాహుల్ గాంధీకి అమ్మ మీద కోపమా? లేక వృద్ధ జంబూకాల మీదనా?

Update: 2020-08-25 08:10 GMT
తాజా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం(సీడబ్ల్యూసీ)లో రాహుల్ గాంధీ బయటపడ్డాడు. సీనియర్ల తీరుపై నిప్పులు చెరిగినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా వృద్ధ జంబూకాల మీద విరుచుకుపడ్డాడని తెలిసింది. తాజాగా దాదాపు 23మంది సీనియర్స్
 కాంగ్రెస్ లో మథనం జరగాలని.. ప్రక్షాళన జరగాలని లెటర్ రాసి సంతకాలు పెట్టి సోనియాగాంధీకి పంపించారు. అయితే అక్కడితో ఆగితే సమసిపోయేది. కానీ దాన్ని మీడియాకు లీక్ చేశారు.

రాహుల్ గాంధీకి అసలే ఈ వృద్ధ జంబూకాలపై కోపంతో ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో వీరి వల్లే ఓటమి ఎదురైందని రాహుల్ భావిస్తున్నారు. కొందరు బీజేపీ కోవర్ట్స్ గా పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే రాహుల్ వ్యాఖ్యలకు కపిల్ సిబాల్, గులాం నబీ అజాద్ ఎందుకు భుజాలు తడుముకున్నారో తెలియదు. వారు ట్విట్టర్ లో రాహుల్ ను టార్గెట్ చేశారు.

సీనియర్లు అంతా కూడబలుక్కొని సోనియాను తప్పుదారి పట్టించారు. రాహుల్ ను చిరాకు పట్టిస్తున్నారు. రాహుల్, ప్రియాంక కలిసి యూత్ ను ఎంకరేజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ప్రజల్లో పలుకుబడి లేని వాళ్లకే సీడబ్ల్యూసీలో చోటు ఉందని.. వారికే రాజ్యసభ పదవులు ఇస్తున్నారని రాహుల్, ప్రియాంక కోపంగా ఉన్నారు. వృద్ధ జంబూకాలు పార్టీలోని యువనేతలను తొక్కేస్తున్నారని.. అలాంటి తప్పిదం వల్లనే మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందని భావిస్తున్నారు. మంచి లీడర్లు అయిన సింధియా కుటుంబం బీజేపీలోకి వెళ్లిందని.. ఇది అంతా సీనియర్స్ సోనియాగాంధీ చుట్టూ చేరి తప్పుదోవ పట్టించడం వల్లనే అని రాహుల్ టీం బలంగా భావిస్తోందట..

అందుకే వృద్ధ జంబూకాలపై రాహుల్ ఫైర్ అయ్యారని సమాచారం.ఇటు అమ్మ మీద కోపం కక్కలేక.. సీనియర్లపై అక్కసు వెళ్లగక్కలేక రాహుల్ సతమతమవుతున్నాడని ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో ఇప్పుడు ఇదే టాపిక్ చర్చనీయాంశమవుతోంది..
Tags:    

Similar News