సంతాపసభలో రాజకీయాలా రజినీ.?

Update: 2018-08-15 10:36 GMT
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అంత్యక్రియలు చిచ్చు రేపాయి.. ప్రధాని మోడీ సహా - కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కరుణానిధి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కానీ తమిళనాడు సీఎం ఫళని స్వామి మాత్రం పాల్గొనలేదు. ప్రభుత్వం తరఫున మంత్రి డి. జయకుమార్ హాజరయ్యారు.దీనిపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. అన్నాడీఎంకే - డీఎంకేకు ఎంత పడకున్నా.. ప్రతిపక్ష నేత మరణానికి అధికార పార్టీ సీఎం రాకపోవడంపై నిరసనలు వెల్లువెత్తాయి.

తాజాగా కరుణానిధి సంతాప సభలో పాల్గొన్న రజినీకాంత్ ఇదే విషయం పై స్పందించారు. కరుణానిధి సంతాప సభలో పాల్గొనని సీఎం ఫళని స్వామి తీరును తూర్పారపట్టారు. ఆయనమైనా ఎంజీఆరా.? లేక జయలలిత అనుకుంటున్నారా అని మండిపడ్డారు. మోడీ - రాహుల్  - వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాగా లేనిది.. తమిళ సీఎం రాకపోవడం దారుణమని మండిపడ్డారు.

తాజాగా రజినీ కాంత్ వ్యాఖ్యలపై అన్నాడీఎంకే మంత్రి జయకుమార్ స్పందించారు. సీఎం తరఫున అంత్యక్రియల్లో తాను పాల్గొన్నానని.. అయినా మృతిచెందిన నాయకుడి సంతాప సభలో రాజకీయాలు మాట్లాడడం రజినీకి మంచిదికాదన్నారు. దీన్ని బట్టి రజినీకి రాజకీయ పరిణితి లేదని అర్థమవుతోందని విమర్శించారు.
Tags:    

Similar News